విశాఖపట్టణం:ముఖ్యమంత్రి  జగన్ నేతృత్వంలో సుధాకర్ పై కుట్ర జరుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. కరోనాను ఎదుర్కోలేక పోతోందని  మాస్కులు, గౌన్లు, పీపీఈలు, వైద్య పరికరాలు ఇవ్వడం  లేదని సుదాకర్ వ్యాఖ్యానిస్తే  తప్పా? వైద్యులకు భద్రతా పరికరాలు లేకపోతే  ప్రాణం పాయం ఉంటుందని అన్నందుకు ఈ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆదివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ సుధాకర్ మానసికంగా సరిగా లేరని ఎందుకు ముద్ర వేస్తున్నారు. అతనిపై షాడో టీం ను ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. 

సస్పెన్షన్ అయినప్పటి నుంచి సుధాకర్ కదలికలపై వాచ్ నిర్వహిస్తున్నారన్నారు.సుధాకర్ ను మోటార్ సైకిల్ పై వెంటాడిన షాడో పార్టీ పోలీసులా ? అడుగడుగునా వెంటాడుతున్న ఆ ఇద్దరు ఎవరని ఆయన ప్రశ్నించారు.

సుధాకర్ కు ప్రభుత్వం ఎందుకు భయపడింది. దళిత డాక్టర్  సుధాకర్ అతని కొడుకుపై కేసుపెట్టిన తర్వాత  వెంటాడింది వేటాడింది ..కార్లో విస్కీ బాటిళ్ళు ఎవ్వరు పెట్టారు. గిట్టనివాళ్లపై  మద్యం బాటిళ్ళు పెట్టి కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.

also read:డాక్టర్ సుధాకర్‌తో మాట్లాడినట్టుగా నిరూపించండి: టీడీపీకి మంత్రి సురేష్ సవాల్
 
రాష్ట్రంలో పలువురు దళితులపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తోంది.. ముఖ్యంగా దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా మార్చడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది. పిచ్చాసుపత్రిలో ఎందుకు  పెట్టారు.  ఆయన   భార్యను ఎందుకు అనుమతించడం లేదు. ఏ ఏ మందులు ఇస్తున్నారు? వైద్యం అందిస్తున్న డాక్టర్లు  ఎవరు? ఆ వైద్యాన్ని ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎటువంటి చికిత్స అందిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

డాక్టర్ సుధాకర్ కు చికిత్స చేసేందుకు ప్రైవేట్ డాక్టర్ల బృందాన్ని అనుమతించాలని ఆయన కోరారు.  ప్రయివేట్ డాక్టర్ల  బృందంతో వైద్యం అందించక పొతే  దళిత సంఘాలన్నీ కూడా చలో  విశాఖకు వెళ్లి సుధాకర్ కు అండగా ఉంటాం డాక్టర్ని చూస్తాం. 13జిల్లాల నుంచి వచ్చే దళితులకు మందులు చూపాలి.  ఈరోజు నుంచి సుధాకర్ పై హెల్త్ బులెటిన్ విడుదలచేయాలని ఆయన కోరారు.  

 ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇదే గతి పడుతుందని హేచ్చరిస్తున్నారా? జగన్ ఎందుకు ఇల్లా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ ఆరోగ్యం,ప్రాణాలతో చెలగాట మాడతారా?  ఇది పద్ధతా ముఖ్యమంత్రి గారు. ఏప్రిల్ లో సస్పెండ్ అయిన నాటి నుంచి సుధాకర్ ను వెంటాడే  షాడో సభ్యులేవరో చెప్పాలన్నారు.సుధాకర్ కు వైద్యం చేస్తున్న వైద్యుల ఫోన్ కాల్ లిస్టును బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.