కుటుంబ సభ్యులతో విభేదాలు.. నరసరావుపేటలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఓ ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సభ్యులతో తలెత్తిన విభేదాలతో మనస్థాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్ గదిలోనే బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన పవన్ నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో అపశృతి.. కరెంట్ షాక్ తో 11 ఏళ్ల బాలుడు మృతి
తన కాలేజీ హాస్టల్ లో ఉంటూ, చదువును కొనసాగిస్తున్నాడు. అయితే కొంత కాలంగా కుటుంబ సభ్యులతో బాలుడికి విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో మనస్థాపం చెందిన బాలుడు సోమవారం తన హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తను ఆత్మహత్యకు గల కారణాలను తెలియజేస్తూ ఓ నోట్ కూడా రాసిపెట్టాడు. అందులో పలు విషయాలను ప్రస్తావించాడు.
ఈ ఘటనపై సమాచారం అందగానే వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఘోరం.. భార్యతో వేరొకరు సన్నిహితంగా ఉండేందుకు హెల్ప్ చేస్తున్నాడని.. స్నేహితుడి దారుణ హత్య..
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.