Asianet News TeluguAsianet News Telugu

ఆ భూములు కొనుగోలుపై సీబీఐ విచారణ జరపాలి: దేవినేని ఉమ డిమాండ్

టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బడ్జెట్ పై భారం పడకుంగడా ఉపాధి నిధులను సద్వినియోగం చేసుకుని రూ.17,330 కోట్లతో నీరు–చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

Devineni Uma Demands CBI Inquiry on Lands Issue
Author
Vijayawada, First Published Jul 15, 2020, 7:22 PM IST

విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బడ్జెట్ పై భారం పడకుంగడా ఉపాధి నిధులను సద్వినియోగం చేసుకుని రూ.17,330 కోట్లతో నీరు–చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ పథకాల ద్వారా సాగునీటి పారుదల రంగంలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని... గ్లోబల్ వాటర్ కన్జర్వేషన్ అవార్డ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు తమ ప్రభుత్వానికి వచ్చాయని గుర్తుచేశారు. 

''కానీ ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు వెళ్లాల్సిన రూ.4500 కోట్లు వైసీపీ నాయకులు పంది కుక్కుల్లా దోచుకుంటున్నారు. మైలవరం నియోజక వర్గం జి-కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో 130 ఎకరాలను ఎకరం రూ. 45 లక్షలు లెక్కన కొని దోచుకున్నారు. బుడమేరు ముంపు సాకుతో రూ. 13 కోట్ల రూపాయల ఉపాధి నిధులను వైసీపీ నాయకుల బందువులకు దోచిపెట్టారు. నిజంగా పనులు చేసి పందికుక్కుల్లా ఉపాధి నిధులు దోచుకోకుంటే రూ.13 కోట్లతో వేసిన ముంపు మేరువు ఎందుకు కొట్టుకుపోయింది?'' అని నిలదీశారు. 

''వైసీపీ ధన దాహానికి బుడమేరు దగ్గర అనేక గ్రామాలు ముంపులో ఉన్నాయి.  మైలవరంలానే అనేక నియోజక వర్గాలలో ఇలాంటి అవినీతికి వైసీపీ వాళ్లు పాల్పడుతున్నారు. నివాసయోగ్యం కానీ మీరు కొనుగోలు చేసిన భూములపై విచారణ చేపట్టాలి'' అని డిమాండ్ చేశారు. 

'' గొప్ప ఇంజనీరు కెఎల్ రావు స్పూర్తితో చంద్రబాబు నాయుడు గోదావరి కృష్ణా అనుసందానానికి శ్రీకారం చుట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువ నుండి బుడమేరు ఛానల్ ద్వారా పవిత్ర సంగమం దగ్గరకి 326 టిఎంసీల గోదావరి నీటిని కృష్ణా  బేసిన్ కు తీసుకువచ్చారు. రైతులకు జూన్ మాసం రాకముందే వ్యవసాయ పనులు చేపట్టారంటే దానికి కారణం చంద్రబాబు. ఇప్పటికే  పట్టసీమ ద్వారా ఈ ఏడాది 10 టిఎంసీలు ఎత్తిపోయడం జరిగింది'' అని వివరించారు.

''ఉమ్మడి ఎపీలో నీరు-మీరు కార్యక్రమం కింద పెద్ద ఎత్తున నీటి సంరక్షణ చేపట్టాం. అనంతరం అధికారంలోకి వచ్చిన  రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎగతాలి చేసింది. 40 వేల చెరువుల్లో 25 లక్షల ఆయకట్టులో 10 లక్షల లోపే దెబ్బతిన్న పరిస్థితులున్నాయి. చెరువుల్లో పూడిక తీత కార్యక్రమంతో మళ్లీ ఎపీలో నీరు - చెట్టు కార్యక్రమం చేపట్టాం. రైతులకు ఉచితంగా పోలాలకు  చెరువు మట్టిని అందించాము. 40,800 చెరువులు రాష్ట్రంలో ఉన్నాయి. అందులో 12,845 చెరువులను 3,087 గొలుసుకట్టు చెరువులుగా అనుసందానం చేసి చరిత్ర సృష్టించాం. మిగతా వాటిల్లోనూ పూడిక తీత పనులు చేపట్టాం'' అని అన్నారు. 

read more   జాబ్స్ క్యాలెండర్ ఏమైంది.. నిరుద్యోగ భృతి ఏది: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు వ్యాఖ్యలు

''నీరు-చెట్టు, వన సంరక్షణ కార్యక్రమాలతో విద్యార్థుల భాగస్వాములగా చేర్చి లక్షలాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాము. చెక్ డ్యాములు, కందకాలు తవ్వకాలతో జల సంరక్షణ చేపట్టాం. మైండ్ ఇరిగేషన్ డిపార్డుమెంట్ ద్వారా 4,851 కోట్లు ఖర్చు పెట్టాము. రూరల్ డెవల్ మెంట్ కింద రూ.12,293 కోట్లు, పారెస్టు ఫోగ్రాం ద్వారా రూ.185 కోట్లు ఖర్చు చేశాము.  వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 13న రూ.1423కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టామని వాళ్లే చెప్పారు. రూ.4851 కోట్లలో రూ.1423కోట్లు పెండింగ్ లో పెట్టి రికార్డు అయిన బిల్లులను అవినీతి అనే బురద చల్లి ఆపారు'' అని మండిపడ్డారు. 

''నీటి సంరక్షన చర్యలు వదిలేశారు. మా మీద కోపంతో నీటి సంరక్షన కార్యక్రమాలపై బురద చల్లు తున్నారు. టిడిపి మీద కక్షతో తెలివితక్కువ తనంతో చేసిన పనుల వల్ల గ్రామాల్లో కురిసిన వర్షం నీరు వాగుల ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి.  రాజకీయ కక్షతో నీటి సంరక్షన కార్యక్రమాలు చేపట్టిన వారికి బిల్లులు ఇవ్వకుండా రాక్షసానందం పొందుతున్నారు. కేంద్ర నిధులు, గ్రాంట్లు ద్వారా చేపట్టే పనులను పక్కన పడేశారు'' అని అన్నారు. 

''పార్లమెంట్ సాక్షిగా నీటి పారుదల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నీరు చెట్టు దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన అంశమని చెప్పారు. నేషనల్ వాటర్ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. స్కాచ్ గోల్డ్ అవార్డును నీరు చెట్టు కార్యక్రమానకి ఇచ్చింది. 93 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని చెరువుల నుండి తీశాం. 12,634 చెరువులు బాగు చేశాం. 97,362 చెక్ డ్యాములు నిర్మించాము. 84,9,0010 పంట సంజీవని కుంటలు తీయడం జరిగింది. 13.25 కోట్ల క్యూబిక్ మీటర్ల  జంగిల్ క్లియరెన్స్ పనులు చేశాం.  753 రాక్ఫిల్ డ్యాములు నిర్మించడం జరిగింది. వీటన్నింటి ద్వారా 87.24 టిఎంసీల నీటి సామర్ధాన్ని రాష్ట్రంలో పెంచాము. 7,30,000 ఎకరాల ఆయుకట్టును స్థిరీకరించాము'' అని వివరించారు. 

''ఇదంతా చంద్రబాబు దూర దృష్టితో చేశారు. ఈ పనులన్నీ చేయడం ద్వారా గ్లోబల్ వాటర్ కన్వర్జేషన్ అవార్డు,  గ్లోబల్ అవార్డు ఫర్ స్కిల్ డెవలప్ మెంట్ అవార్డులు పొందటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పందికొక్కుల్లాగా ఉపాది హామీ నిదులను మింగుతున్నారు. 4500 కోట్లలో కూలీలకు వెళ్లాల్సిన డబ్బును ప్పొక్లెయిన్లు పెట్టి  పనులు చేయించి దబ్బులు దండుకుంటున్నారు'' అని మండిపడ్డారు. 

''రూ.7500 కోట్లను పేదవాళ్లను అడ్డం పెట్టుకుని తిన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అదికార పార్గీ నాయకులు కేంద్రం సీబీఐ విచారణకు బాధ్యత వహించాలి. 14 నెలల్లో చేసిన అరాచకాలు లెక్కపెట్టే రోజులు వచ్చాయి. ప్రభుత్వం ఎందుకు ఉపాధి హామీ నిధులతో జల సంరక్షన చర్యలు చేపట్టలేకపోతోంది. చంద్రబాబు నాయుడు ముందు చూపుతో జల సంరక్షణకు ముందుకు వెళ్తే మాపై కక్షతో వాటిని నిర్లక్ష్యం చేశారు'' అని ఉమ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios