అమరావతి: అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సీనియర్లతో చర్చించారు. ముఖ్యంగా మండలిలో వైసీపీ సభ్యుల తక్కువగా ఉంది. దీంతో మండలిలో అనుసరించాల్సిన వ్యూహాంపై సీఎం  కీలక నేతలతో చర్చించారు.

ఆదివారం నాడు తాడేపల్లిలోని తన నివాసంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also read: వంశీ, మద్దాల గిరికి టీడీపీ విప్:వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు

రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. అమరావతి కాకుండా మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉండేలా సంకేతాలు ఇచ్చింది. ఈ తరుణంలో  ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో హైపవర్ కమిటీ నివేదికను కూడ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Also read:రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు: నేడు భేటీ కానున్న టీడీఎల్పీ

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు కేబినెట్ నోట్‌కు సంబంధించిన సమాచారం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఆదిావరం నాడు ఉదయం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాంతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

Also read:ఏపీ హైకోర్టు ఆఫర్: సీఆర్‌డీఏకు ఈ నెల 20వ తేదీ వరకు రైతులకు గడువు

మరో వైపు గుంటూరు పార్టీ కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశమైంది. ప్రభుత్వం అనుసరించే వ్యూహానికి ధీటుగా  టీడీఎల్పీ వ్యూహారచన చేస్తోంది