అమరావతి: ఈ నెల 20వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ శాసనసభపక్షం ఆదివారం నాడు సమావేశం కానుంది.

Also read:ఏపీ హైకోర్టు ఆఫర్: సీఆర్‌డీఏకు ఈ నెల 20వ తేదీ వరకు రైతులకు గడువు

ఇవాళ ఉదయం టీడీఎల్పీ సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులను తెరమీదికి తీసుకొచ్చింది. మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికపై  అసెంబ్లీలో చర్చించనున్నారు.

ఈ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నందున  ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపై  టీడీఎల్పీ సమావేశంలో చర్చించనున్నారు. 

అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది. సమావేశాల్లోనే అమరావతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.దీంతో ఈ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలకు టీడీపీ మద్దతు ప్రకటించింది.