కొత్త మంత్రివర్గంలో ముగ్గురు సీనియర్ మంత్రులకు శాఖల్లో కత్తెర వేసి డిమోషన్ ఇచ్చారు చంద్రబాబునాయుడు.
కొత్త మంత్రివర్గంలో ముగ్గురు సీనియర్ మంత్రులకు శాఖల్లో కత్తెర వేసి డిమోషన్ ఇచ్చారు చంద్రబాబునాయుడు. మొన్నటి వరకూ వ్యవసాయ శాఖను చూసిన ప్రత్తిపాటి పుల్లారావుకు ఇపుడు పైర సరఫరాల శాఖను కేటాయించారు. పౌర సరఫరాల శాఖ కూడా పెద్దదే అయినప్పటికీ వ్యవసాయ శాఖతో పోల్చుకుంటే తక్కువే. పైగా వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది కూడా. అదేవిధంగా, రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దారాఘవరావుకు కొత్తగా అటవీ, పర్యావరణ శాఖను కేటాయించారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖను నిర్వహించిన పరిటాల సునీతను కొత్తగా మహిళా, శిశు సంక్షేమ శాఖకు కుదించారు.
నారా లోకేష్ తో పాటు మొదటిసారి మంత్రులైన వారిలో పలువురికి భారీ శాఖలను కేటాయించటం గమనార్హం. అమరనాధ్ రెడ్డికి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్ శాఖలు కేటాయించారు. లోకేష్ కు కూడా పంచాయితీ రాజ్, గ్రామాణీభివృద్ధి శాఖ, సుజయ కృష్ణ రంగారావుకు మైనింగ్, ఆదినారాయణరెడ్డికి మార్కెటింగ్, డైరీ డెవలప్ మెంట్, అఖిలప్రియకు పర్యావరణ శాఖలు కేటాయించటం గమనార్హం.
