కన్నతండ్రినే కడతేర్చిన కసాయి కూతురు, ప్రియుడితో కలిసి...

Daughter kills father in krishna district
Highlights

అక్రమ సంబంధానికి అడ్డు  వస్తున్నాడని ఓ యువతి కన్న తండ్రిని హతమార్చిన దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మానవ సంబంధాలకు విలువివ్వకుండా ప్రియుడితో కలిసి కన్న తండ్రిని అతి దారుణంగా హతమార్చింది. అంతే కాకుండా ఈ హత్యను ఆత్మహత్యకు చిత్రీకరించింది. కానీ చివరకు అసలు విషయం బైటపడి ప్రియుడితో కలిసి కటకటాలపాలయ్యింది.

ఈ దారుణానికి సండబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్టా జిల్లా తుక్కులూరు కు చెందిన శేషు కుమారి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఈ విషయం తెలియడంతో ఆమె తండ్రి వీరిని కలవకుండా అడ్డుపడుతున్నాడు. ఇలాంటి పనులను మానుకోవాలని కూతురిని గట్టిగా హెచ్చరించాడు. దీంతో ఆమె తండ్రిపై కోపాన్ని పెంచుకుంది.

ఈ క్రమంలో తండ్రిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఒంటరిగా ఉన్న తండ్రిని ప్రియుడి సాయంతో హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.  అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనపై అనుమానం రావడంతో విచారణ జరిపారు. 

మృతుడి కూతురు శేషు కుమారి కాల్ డేటా ఆధారంగా కూపీ లాగిన పోలీసులు ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావు ను పట్టుకుని విచారించారు. దీంతో అతడు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు ఈ హత్యకు కారణమైన మృతుడి కూతురు లింగమనేని శేషు కుమారితో పాటు ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.  

loader