Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ పోస్టును షేర్ చేసి.. చిక్కుల్లో పడ్డ పురందేశ్వరి...

ఇది నిజమో, కాదో నిర్ధారించుకోకుండా బీజేపీ నేత Daggubati purandeswari ఆ ఫేక్ పోస్ట్ ను  తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  అంతటితో ఊరుకోకుండా ‘వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక మనకు బూడిదే మిగిలింది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

daggubati purandeswari shares fake news on cm ys jagan
Author
Hyderabad, First Published Oct 6, 2021, 1:50 PM IST

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఫేక్ పోస్టును షేర్ చేసి చిక్కుల్లో పడ్డారు. వివరాల్లోకి వెళితే... ఒక ఆటో వెనుక అంటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ర్రెడ్డి బొమ్మ నుంచి బూడిద రాలుతోందని,  ఇది ys jagan మహిమే అంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఒక fake post ను సృష్టించారు.  దీన్ని సాక్షి వెబ్ సైట్ పోస్టు చేసినట్టు  సాక్షి లోగో వాడారు.

అయితే,  ఇది నిజమో, కాదో నిర్ధారించుకోకుండా బీజేపీ నేత Daggubati purandeswari ఆ ఫేక్ పోస్ట్ ను  తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  అంతటితో ఊరుకోకుండా ‘వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక మనకు బూడిదే మిగిలింది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు.. నిరుపయోగ ఆస్తులు వినియోగించుకోవడం మంచిదే.. : పురందేశ్వరి

కానీ ఆటో వెనుక అతికించిన  సీఎం వైఎస్ జగన్ చిత్రం నుంచి  ఎక్కడ బూడిద రాలలేదు.  ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశం లేకపోవడంతో  ప్రతిపక్ష  పార్టీ ల కార్యకరలు ఏకంగా ‘సాక్షి’ వెబ్ సైట్ లోగో తో ఫేక్ పోస్ట్ ను సృష్టించారు.  సాక్షి వెబ్ సైట్ లో అటువంటి వార్తను ప్రచురించనేలేదు. కానీ దగ్గుబాటి పురంధరేశ్వరి వాస్తవాలు నిర్ధారించుకోకుండానే ఆ ఫేక్ పోస్ట్ ను తన ఖాతాలో పోస్ట్ చేశారు.

కాగా ఫేక్ పోస్ట్ లను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సాక్షి డిజిటల్‌సెల్ విభాగం హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios