Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు.. నిరుపయోగ ఆస్తులు వినియోగించుకోవడం మంచిదే.. : పురందేశ్వరి

రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. వారి ఇచ్చే టాక్స్ లతో ప్రభుత్వానికి ఆదాయం రావాలి కానీ అలా జరగడం లేదని.. ఈ రాష్ట్ర ప్రజలు రెండు సార్లు మోస పోయారని అన్నారు.

bjp leader purandeshwari comments on visakha steel plant
Author
Hyderabad, First Published Sep 4, 2021, 2:35 PM IST

రాష్ట్రం లో ఉన్న పరిస్థితులు పై పదాధికారుల సమావేశంలో చర్చించుకున్నామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి డి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని టిడిపిని గెలిపించారు. కానీ, న్యాయం జరగాల్సింది పోయి జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు.

పాదయాత్ర చేసి ప్రజలకు మేలు చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన వారు ఏమి చేయలేదు. ఈ రెండున్నర సంవత్సరాలు పరిశీలిస్తే  న్యాయం జరిగిందా అని చూస్తే మోసం, అవినీతి జరిగింది. విద్వాంసకర, కక్ష పూరిత అంశాలే జరిగాయి. ఆలయాలలో విగ్రహాలు కూల్చివేత, విద్వాంసం కొనసాగింది. బిజెపి వారి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.

జాతీయ మీడియా సైతం రాష్ట్ర గౌరవానికి భంగం కలుగుతోందని చెబుతోంది. రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పలుగా మారింది. కనీసం ఏ బాంక్ ముందుకు వచ్చి అప్పు ఇవ్వలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. 

ఒక ప్రక్క ప్రజలకు పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారు.. మరో వైపు లాగేస్తున్నారన్నారు. అమ్మఒడి పేరిట 15 వేలు ఇస్తున్నారు. మరో వైపు మద్యం రూపంలో లాగేస్తున్నారు. ఆటో వారికి 10 వేలు ఇస్తున్నారు. విపరీతమైన చలాన్లతో లాక్కుంటున్నారు.

మద్యం విక్రయాల్లో ఈ రోజు వరకు డిజిటల్ లావాదేవీలు ప్రవేశ పెట్టలేదు. ఇసుకను బంగారం లా మార్చేశారు. 1.80 వేలు పేదలకు కేంద్రం ఇస్తున్న నిధులు తప్ప మరో రూపాయి కూడా రావడం లేదు. ఇసుక రేట్ పెరగడం వల్ల ఇళ్ల నిర్మాణం జరగడం లేదు అన్నారు. 

రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. వారి ఇచ్చే టాక్స్ లతో ప్రభుత్వానికి ఆదాయం రావాలి కానీ అలా జరగడం లేదని.. ఈ రాష్ట్ర ప్రజలు రెండు సార్లు మోస పోయారని అన్నారు. 2014, 2019 లో ప్రజలు మోసపోయారు. 2008 2010 లో మన్మహన్ సింగ్ నిర్మాణ రంగానికి సహకరించాలని మౌలిక సదుపాయాల బాంక్ లు ప్రవేశపెట్టారు. అదే విధంగా ప్రధాని మోదీ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రేషన్ బాంక్ లు ఏర్పాటు  చేస్తున్నారు. 

మౌలిక సదుపాయలు మెరుగు పరచాలి. మౌలిక సదుపాయాలకు వనరులు అవసరం. ఐదు రంగాలలో ఉన్న నిర్ధరక  ఆస్తులను వినియోగించాలి అనుకుంటున్నాం. అలాంటి నిరుపయోగ ఆస్తులు వినియోగించుకోవడం మేం సమ్మతిస్తున్నాం.స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడుతూ...  స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. పోస్కో వచ్చిందన్నారు.. ఎక్కడ వచ్చింది అన్నారు ఏది?  పోస్కో వచ్చిందని మీడియా చెప్తూనే.. టాటా సంస్థ కొనడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు.

అక్కడ ఉన్న ఉద్యోగులకు ప్యాకేజ్ ఇవ్వడం ,వారి ఆదుకోవడం అంశంపై ఆలోచిస్తాం. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ గా బిజెపి ఉందని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios