Asianet News TeluguAsianet News Telugu

బెజవాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్... గుట్టు రట్టు చేసిన పోలీసులు

మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసి దాడి చేసినట్లు డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. 

cricket betting gang arrested in bejawada
Author
Vijayawada, First Published Sep 20, 2020, 2:07 PM IST

విజయవాడ: బెజవాడ కేంద్రగా క్రికెట్  బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అన్ లైన్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ పై ఓ ముఠా భారీగా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ ముఠా బెజవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దాడిచేసిన పోలీసులు నిర్వహకులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా కంప్యూటర్లతో సహా  ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసిందని అన్నారు. అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారని... బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ లో ఆడతారన్నారు. దాదాపు 12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. 

read more  పంజాబ్ వర్సెస్ ఢిల్లీ: భావి భారత కెప్టెన్ ను నిర్ణయించే పోరు

పరారీలో వున్న ప్రధాన సూత్రధారి నవీన్ ను త్వరలో అదుపులోకి తీసుకుంటామని డిసిపి తెలిపారు. ఈ దాడుల్లో బెట్టింగ్ ఎక్విప్మెంట్ మొత్తం స్వాధీనం చేసుకున్నామన్నారు.  ఐపీఎల్ రోజుల్లో పోలీసులకు బెట్టింగ్ పై సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ వ్యాలెట్ ద్వారా నగదు వ్యవహారాలు చేస్తున్నారని...విద్యార్ధులు ఇలాంటి బెట్టింగ్ లకు ఆకర్షితులు కావద్దని డిసిపి కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios