అమరావతి: అమరావతి ఉద్యమం దేశమంతా పాకిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అభిప్రాయపడ్డారు.  నాలుగు వేల పోలీసులు లేకపోతే సీఎం జగన్ బయటకు రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. 

Also read: అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

గురువారం నాడు అమరావతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మీడియాతో మాట్లాడారు. మందడంలో ఒక మనిషికి నలుగురు పోలీసులను పెట్టారని నారాయణ విమర్శించారు. ఏపీలో ఉన్న 5గురు డిప్యూటీ సీఎంలు ఆరవ వేలు లాంటి వారని నారాయణ విమర్శలు గుప్పించారు. 

Also read:మేం గాజులు తొడుక్కోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై నందమూరి రామకృష్ణ ఫైర్

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

మహిళలపై పోలీసులు ఎందుకు దాడులు చేస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. అందరూ ఒప్పుకున్న తర్వాతే  అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు ఎందుకు రాజధాని మూడు ముక్కలు చేస్తున్నారో చెప్పాలని ఆయన  సీఎం జగన్‌ను ప్రశ్నించారు.

Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి

Also read:కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

 రాజీనామాలు చేసి ఎన్నికలు వెళ్లాలని నారాయణ కోరారు.   అప్పుడు మళ్ళీ ప్రజా తీర్పు అనుకూలంగా వస్తే మూడు రాజధానులను ఏర్పాటు చేసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీఎం జగన్‌కు సూచించారు. అప్పటి వరకు రాజదానిపై చేయి వేసే హక్కు సీఎం జగన్ కి లేదని ఆయన తేల్చి చెప్పారు.

Also read:పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

విశాఖ వెళ్తే ముందు ఉద్యోగస్తులకు హౌస్ రెంట్,ప్రయాణ ఖర్చులు అని రెండు లక్షల కోట్లు అవసరం అవుతాయన్నారు.  రాజదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. శవాల మీద పేలాలు ఎరుకునేలా ఈ ప్రభుత్వ పనితీరు ఉందని నారాయణ విమర్శించారు.