అమరావతి: బీజేపీతో  జనసేన దోస్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చెగువేరా ఆదర్శమని చెప్పిన పవన్ కళ్యాణ్ చెంగువీర అయ్యారని రామకృష్ణ ఎద్దేవా చేశారు.

Also read:మేం గాజులు తొడుక్కోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై నందమూరి రామకృష్ణ ఫైర్

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

గురువారం నాడు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ తాత్సారం చేస్తే పాచిపోయిన లడ్డులు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి

Also read:కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

ఢిల్లీలో బీజేపీ నేత జేపీ నడ్డాను కలిసిన తర్వాత  పవన్ కు నడ్డా బందరు లడ్డూలు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. డిల్లీ వెళ్లిన నేతలంతా జేఎన్‌యూకు వెళ్తే పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆపీసుకు వెళ్లారని రామకృష్ణ చెప్పారు.

Also read:పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతాడని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌కు దమ్ముందో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.