కాకినాడ: చంద్రబాబునాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ భాషను మార్చుకోవాలని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ భాషను మార్చుకోకపోతే తాను అంతకంటే ఎక్కువగా మాట్లాడుతానని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తేల్చి చెప్పారు.

బుధవారం  సాయంత్రం కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  మా నాయకుడిని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

Also read:పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

ప్లాన్ ప్రకారంగా తమ పార్టీ కార్యకర్తలను నెట్టుకొంటూ తన ఇంటి వైపుకు వచ్చారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి ఏదో కుట్ర చేయాలని భావిస్తున్నారన్నారు.

ప్లాన్ ప్రకారంగా జనసేన కార్యకర్తలు  దాడికి యత్నించారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.మీరు ఒక్కమాట అంటే నేను రెండు మాటలు అంటానని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Also read:కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

ఆదివారం నాడు జరిగిన ఘటనలో జనసేనతో పాటు తమ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడ గాయపడ్డారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారుకాపు ఉద్యమంలో పాల్గొన్న ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినా ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.

తన రాజకీయ జీవితంలో చిన్న మచ్చ కూడ లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఆందోళనల్లో చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్ ఇష్టారీతిలో మాట్లాడారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు.

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో తాను అలా మాట్లాడినట్టుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై  విమర్శలు చేస్తే తాను  చూస్తూ ఊరుకోనని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తేల్చి చెప్పారు.