రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేయాలనుకున్న భూ సేకరణను కోర్టు నిలిపేసింది. రాజధాని గ్రామాలైన నవులూరు, కురగల్లు, బేతపూడి, పెనుమాక గ్రామాల్లో రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం భూములు సేకరించాలని అనుకున్నది. అనుకున్నదే ఆలస్యం వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. అయితే, ఇప్పటికే భూ సేకరణపై రైతుల తరపున పోరాటం చేస్తున్న వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని రైతులు ఆశ్రయించారు. దాంతో ఆళ్ళ వెంటనే కోర్టులో పిటీషన్ వేశారు.  కేసు పూర్వాపరాలను విచారించిన కోర్టు మంగళవారం భూసేకరణ నోటిఫికేషన్ పై స్టే విధించింది. 2 వారాలలో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది.