అనంతపురం కోర్టులో మంత్రి పరిటాల సునీత వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. వైసిపి నేత దాఖలు చేసిన ఓ పరువు నష్టం కేసులో మంత్రి పరిటాల సునీత దగ్గర బంధువుకు కోర్టు భారీ జరిమానా విధించింది. ఇంతకీ విషయం ఏమిటంటే,  అప్పుడెప్పుడో జూబ్లూహిల్స్ లో కారుబాంబు పేలుడు గుర్తుంది కదా? ఆ కేసుకు సంబంధించి మంత్రి బంధువు వైసిపి నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారట. దానిపై మండిపడిన రాప్తాడు నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త తోపుదుర్తి  మంత్రి బంధువుపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.

ఆ కేసును విచారించిన అనంతపురం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. మంత్రి సునీత సమీప బంధువు ఎల్.నారాయణ చౌదరి రూ. 10 లక్షలు, ఆంధ్రజ్యోతి సిబ్బంది లక్ష రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లిహిల్స్ కారుబాంబు సంఘటనకు తోపుదుర్తికి ఎటువంటి సంబంధం లేదని కూడా కోర్ట తేల్చిచెప్పింది.