ఏపీలో విజృంభిస్తున్న కరోనా: 24 గంటల్లో 44 కొత్త కేసులు, మొత్తం 647కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 647కి చేరుకొన్నాయి.ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 565కి చేరాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 647కి చేరుకొన్నాయి.ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 565కి చేరాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
also read:వైఎస్ జగన్ ఇంటి సమీపంలోని అపార్టుమెంటులో మహిళ మృతి
కర్నూల్ జిల్లాలో కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 6 ,గుంటూరులో 3, అనంతపురంలో 3, విశాఖలో 1 కొత్త కేసు నమోదైంది.ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొంది 65 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో ఓ వ్యక్తి ఈ వైరస్ కారణంగా మృతి చెందారు.
జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు
కర్నూల్-158
గుంటూరు-129
కృష్ణా-75
నెల్లూరు-67
ప్రకాశం-44
కడప-37
పశ్చిమ గోదావరి-35
అనంతపురం-29
చిత్తూరు-28
తూర్పు గోదావరి-24
విశాఖపట్టణం-21
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడ నమోదు కాలేదు. కరోనా వైరస్ సోకి రాష్ట్రంలో 17 మంది మృతి చెందారు.