కరోనా ఎఫెక్ట్: పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం...
తాజాగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా సాధ్యమైనంత మేర కాంటాక్ట్ ని తగ్గించేందుకు వీలుగా బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రజలను బయటకు రానీయకుండా ఆంక్షలను విధిస్తు... జనసమ్మర్థమైన ప్రదేశాలను అన్ని దేశాల ప్రభుత్వాలు మూసివేసి కట్టుదిట్టమైన నివారణ చర్యలను తీసుకుంటున్నాయి అన్ని ప్రభుత్వాలు.
భారతదేశంపై కూడా ఈ మహమ్మారి పంజా విసరడం ఆరంభించడంతో భారతప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేంద్రప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ ని దేశం నుండి తరిమి కొట్టేందుకు పూనుకున్నాయి
Also read; కరోనా వైరస్: ఇటలీ పౌరుడి ఆవేదన, మన పోలీసుల అనువాదం
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ వైరస్ పై యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూనే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తోంది.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ లో వాయిదా పడ్డాయి. ఇండ్ల పట్టాల పంపిణి కార్యక్రమాన్ని కూడా వచ్చే నెలకు వాయిదా వేసింది. ఇక తాజాగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా సాధ్యమైనంత మేర కాంటాక్ట్ ని తగ్గించేందుకు వీలుగా బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
కాకపోతే పింఛన్లు స్వీకరించారు అనే విషయానికి పేరొఫ్ కోసమని సంతకాలను గ్రామా వాలంటీర్లు సేకరిస్తారు. ఒకవేళ నిరక్షరాస్యులయితే... వారిఫొటోలను స్వీకరిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Also read: కోరలు చాస్తోన్న కరోనా: ధన్వంతరి యాగం చేయనున్న టీటీడీ
ఇక ఇదే విధానాన్ని రేషన్ సరుకుల పంపిణీ విషయంలో కూడా పాటించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ- పాస్ యంత్రాలను వినియోగించకుండా.. పాత పద్దతిలోనే రికార్డు పుస్తకాల్లో నమోదు చేయనున్నట్టు తెలిపారు.
ఇకపోతే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యా రోజు రోజుకి పెరిగిపోతుంది. దేశంలో 258 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్ర ఎక్కువగా కరోనావైరస్ వ్యాప్తికి గురైనట్లుకనిపిస్తోంది. ఆ తర్వాత స్థానం కేరళ ఆక్రమిస్తోంది. విదేశాల నుంచి ముంబైకి ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉండడం వల్ల కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు భావించవచ్చు.
గల్ఫ్ నుంచి కేరళకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు భావించవచ్చు.
మహారాష్ట్రలో 52 కేసులు నమోదు కాగా, కేరళలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యఅంతకంతకూ పెరుగుతున్నాయి. హిమాచల్ లో మొదటి కరోనా కేసు నమోదైంది. మధ్యప్రదేశ్, గుజరాత్ ల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.