Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్: ఇటలీ పౌరుడి ఆవేదన, మన పోలీసుల అనువాదం

ఒక ఇటలీ పౌరుడు రాసిన లేఖను మన పోలీసులు అనువాదం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇటలీ పరిస్థితిని ఆ దేశ పౌరుడు కళ్లకు కట్టినట్లు రాశాడు. దాన్ని యధాతథంగా ఇక్కడ చదవండి

Coronavirus: Italy citizen's letter translated by police
Author
Hyderabad, First Published Mar 19, 2020, 1:30 PM IST

ఒక ఇటలీ పౌరుడు రాసిన లేఖను మన పోలీసులు అనువాదం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇటలీ పరిస్థితిని ఆ దేశ పౌరుడు కళ్లకు కట్టినట్లు రాశాడు. దాన్ని యధాతథంగా ఇక్కడ చదవండి.

ప్రపంచ ప్రజలకు ఇటలీ దేశం నేర్పుతున్న గుణపాఠం.... పరిస్థితి చేయిదాటకముందే దేశ ప్రజలారా మేల్కొండి..... ఇటలీ నుండి ఒక ముఖ్యమైన సందేశం... అందమైన దేశం... మా ఇటలీ దేశం. ప్రశాంతమైన జీవితం మాది. ఇక్కడి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు... మా దేశం ఇటలీ మహా నగరం మిలాన్. ఇటలీ పౌరుడిగా నేను మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను 

అదేమంటే మా నగరంలో జీవితం ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఎందుకు ఈ విధంగా దుర్బరంగా మారిపోయింది? ప్రపంచంలోనే అందమైనదిగా పేరొందిన మా నగరం ఎందుకిలా చిమ్మ చీకట్ల లోకి నెట్టబడింది??మీరంతా మేము చేసిన పొరపాట్ల నుండి నేర్చుకొని మాలాగా మీ జీవితాలను మీ దేశాన్ని చీకట్లోకి నెట్టి వేయరని, నెట్టి వేయకుండా ఉంటారని మీకు ఈ విషయం చెబుతున్నాను.

ఇప్పుడు మేమంతా ఉన్నది క్వారంటైన్ లో.... మాకు మేముగా ఒక చీకటి చెరసాలలో నిర్బంధించుకున్నాం. వీధుల్లోకి వెళ్ళలేము, పొరపాటున వెళితే వెంటనే పోలీస్ లు వచ్చి తీసుకెళ్లి మళ్ళీ చెరసాలలో బంధిస్తారు. అన్ని మూతపడ్డాయి, షాపులు ఆఫీసులు వీధులు అన్ని మూతపడ్డాయి.....

మాకనిపిస్తుంది ఇదే యుగాంతం ఏమో అని... ఇంకా మా జీవితాలు ముగిసిపోయిన అధ్యాయాలేమో అని.

మాది ఒక అందమైన అభివృద్ధి చెందిన దేశం... మేము అనుకోలేదు ఇలా ఈనాడు గాఢాంధకారంలోకి నెట్టి వేయబడుతామేమో అని దీనికంతటికి కారణం ఒకటే మేమే... మా దేశ ప్రజలే అంటే మేమే ఇటాలియన్సే... అందులో ఏ మాత్రం సందేహం లేదు. మేము చేసినటువంటి తప్పే మా దేశం అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం.. నిజం. ఒక్క క్షణం మేము గత పది రోజుల క్రితం మా ప్రభుత్వ అధికారులు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఈనాడు మా దేశానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. 

వ్యాధి వ్యాపిస్తుందని బయటకు వెళ్ళవద్దని మా ప్రభుత్వం సెలవులు ఇస్తే మేమేం చేశాం....?

విహారయాత్రలకు వెళ్ళాం, తీర్థ యాత్రలకు వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం, షీకార్లకి తిరిగాం, చిన్న చిన్న పార్టీలు చేసుకున్నాం, బజారు లో కూర్చుని గుంపులుగుంపులుగా ముచ్చట్లు పెట్టుకున్నాం. అందరం కూడా ప్రభుత్వం చేసిన సూచనల్ని చాలా తేలిగ్గా తీసుకున్నాం.

ఆనాడు మాకు తెలియదు ఆ క్షణం చేసినటువంటి ఆ చిన్న తప్పు... ఈనాడు మా దేశాన్ని మా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని తెలియలేదు. రోజుకు రెండు వందల మంది చనిపోతున్నారు. మా ప్రజలు జీవితాలు చాలా దుర్భరంగా తయారయ్యాయి.

మా దేశంలో మందులు లేక ఇలా కాలేదు, వైద్యులు లేక కూడా ఇలా కాలేదు... కేవలం అంతమంది వ్యాధిగ్రస్తులను ఉంచడానికి సరిపోయేంత స్థలం లేక.... కేవలం స్ధలం లేక... 80 ఏళ్ళ పైబడిన వృద్దుడికి కరోనా సోకితే సజీవంగానే తగలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా మాకు మేము చేసుకున్నదే!!

ఇదంతా దేశ ప్రజలుగా మేము చేసిన తప్పు వల్లనే... కేవలం మేము చేసిన తప్పు వల్లనే.ప్రభుత్వం చెప్పిన మాట వినకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. గతంలో ఇంకొకరికి సహాయం చేసే స్థితిలో ఉన్న మేము ఇప్పుడు ప్రపంచం చేసే సహాయం కోసం దేహి అని అర్థిస్తున్నాం. 

అవును మేము తప్పు చేశాం... వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం సెలవులు ఇస్తే వాటిని మేము విందులు వినోదాల పేరుతో విచ్చలవిడిగా తిరగటానికి ఉపయోగించుకున్నాం.

ప్రపంచ ప్రజలారా మేల్కొండి మా పరిస్థితి మీకు రావద్దని మా ఆశ... ఆకాంక్ష!! ఎందుకంటే ఈ మా కష్టం ప్రపంచంలోని ఏ దేశానికి రావద్దు. రాకూడదు కూడా. 

తక్షణమే మీ దేశంలోని ప్రభుత్వం మీ ప్రభుత్వ అధికారులు చేసినటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటించండి. ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ప్రభుత్వ సలహాలను తప్పకుండా పాటించండి. 

పండుగలు,జాతరలు,పెళ్లిళ్లు పేరంటాలు ఇప్పుడు కాకపోతే మరోసారి ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు. తీర్చుకోవాల్సిన మొక్కులు, ప్రార్థనలు... సెలవులు వచ్చాయి కదా అని తీర్థయాత్రలు చేస్తే పనైపోతుందని ఆశ పడకండి... కేవలం ఆ పనైపోతుందని దేశ ప్రజల ప్రాణాలనే ఫణంగా పెట్టకండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ సూచనలను పాటించి మీ దేశాన్ని, మీ దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోండి.

నేను చెప్పేది మీరు అర్ధం చేసుకోండి. అందమైన అభివృద్ధి చెందిన ఒక చిన్న దేశంగా మొదలెట్టిన మా ప్రయాణం ఈనాడు ఎలా ఉందో మీరంతా చూస్తూనే ఉన్నారు... మీకు మా పరిస్థితి రావొద్దు... మా దయనీయ పరిస్థితి ఇంక ఏ ఇతర దేశానికి రావద్దు.

మీరు మారుతారని ఆశిస్తూ... 
మీ మిత్ర దేశ పౌరుడు.

Follow Us:
Download App:
  • android
  • ios