నెల్లూరులో వ్యక్తికి కరోనా లక్షణాలు
నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా వ్యాధి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు వచ్చినట్టుగా వైద్యలు అనుమానిస్తున్నారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా వ్యాధి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు వచ్చినట్టుగా వైద్యలు అనుమానిస్తున్నారు.
Also read:కేరళ, కర్ణాటక కొత్త కేసులు: భారత్‌లో 56కు చేరిన కరోనా బాధితులు
నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు అనుమానిస్తున్నారు. వైద్యులు ఆ వ్యక్తి శాంపిల్స్ ను పూణె ల్యాబ్ కు పంపారు. పూణె నుండి బుధవారం నాడు సాయంత్రానికి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది
ఇటలీలో నివాసం ఉండే ఈ యువకుడు 14 రోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఢిల్లీ , చెన్నై విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా లక్షణాలు మాత్రం తేలలేదు.
ఇదే కారణంగా నెల్లూరు ఇవాళ జరగాల్సిన రథోత్సవం కొన్ని వార్డులకే పరిమతం చేశారు.చిన్న బజారుకు చెందిన యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఈ రథోత్సవాన్ని పట్టణం మొత్తం నిర్వహించకుండా నిలిపివేశారు.