కాకినాడ: పెథాయ్ తుఫాన్ ప్రభావం వల్ల  కాకినాడపై పెద్దగా ఎఫెక్ట్ చూపకపోవడానికి కోరంగ  మడ అడవులు కారణమని  అధికారులు ప్రకటించారు. పెథాయ్ తుఫాన్  ప్రభావిత ప్రాంతాల ప్రజలను  పునరావాస ప్రాంతాలకు తరలించారు. నష్టం అంచనాలను ప్రభుత్వం సేకరిస్తోంది.

పెథాయ్ తుపాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని  వాతావరణ నిపుణులు ముందే చెప్పారు. 

కాకినాడ సమీపంలోనే పెథాయ్ తీరం దాటింది. అయితే   కోరంగ మడ అడవులు,  హోప్ ఐల్యాండ్‌లు  తుఫాన్ తీవ్రతను మరింత తగ్గించాయి.   కోరంగ మడ అడవులు 23570 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఏడాది పోడవునా కూడ ఈ అడవిలో ఉన్న చెట్లు మునిగే ఉంటాయి. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మరో అడుగు నీరు ఎక్కువగా ఈ అడవుల్లోకి వస్తోంది.

హోప్ ల్యాండ్, కోరంగి అడవి  కాకినాడకు సమీపంలో ఉంటుంది. ఈ అడవిలో భారీ వృక్షాలు గుబురుగా పెరిగి ఉంటాయి. పెథాయ్ తుఫాన్ ప్రభావాన్ని  ఈ అడవిలోని భారీ వృక్షాలు తగ్గించాయని  వాతావరణ నిపుణులు  అభిప్రాయపడుతున్నారు.  కోరంగ అడవికి ఇంకా ముందు ప్రాంతంలో ఉన్న హోప్ ఐల్యాండ్  18 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

బ్రిటీష్  కాలంలో హోప్ ఐలాండ్ నుండి సరుకులను  పలు దేశాలకు సరఫరా చేసేవారు.బ్రిటీష్ కాలంలో కూడ తుఫాన్లు సంభవించిన సందర్భంలో వేలాది మంది చనిపోయినట్టుగా స్థానికులు చెబుతున్నారు. 1996లో  హరికేన్ తుఫాన్  వచ్చిన  సందర్భంలో   కోరంగ మడ అడవులు కూడ ఈ తుఫాన్ తీవ్రతను  కొంత మేర తగ్గించినట్టు స్థానికులు గుర్తు చేసుకొంటున్నారు. 


సంబంధిత వార్తలు

పెథాయ్ ఎఫెక్ట్: పొలంలోనే మృతి చెందిన రైతు

ప్రధాని అయ్యే ఆలోచన లేదు:చంద్రబాబు

పెథాయ్‌ తుఫాన్: విపక్షాల విమర్శలకు బాబు కౌంటర్