హైదరాబాద్: తనకు ప్రధాని అయ్యే  ఆలోచన లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  మరోసారి స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకొంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఆయన  బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాంకేతికమని ఆయన చెప్పారు.పక్క జిల్లాలో ఉండి కూడ తుఫాన్ బాధితులను పరామర్శించని నేతలు కూడ తనపై విమర్శలు గుప్పిస్తున్నారని పరోక్షంగా వైఎస్ జగన్‌పై బాబు వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

తుపాన్‌ పరిస్థితిని అనలైజ్ చేసేందుకు ప్రపంచంలోనే  ఉత్తమ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దినట్టు  చంద్రబాబునాయుడు చెప్పారు. చేపల వేటకు వెళ్లిన 26 మంది మత్య్సకారుల్లో ఇప్పటికే 12 మంది ఒడ్డుకు సురక్షితంగా చేరారని బాబు తెలిపారు.  తుఫాన్ సమయంలో  సెల్‌ టవర్లు నిరంతరంగా పనిచేసేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నట్టు చెప్పారు.

పూర్తిస్థాయి అప్రమత్తతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించినట్టు బాబు తెలిపారు. రాష్ట్రంలోని 172 ప్రాంతాల్లో 6 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు.పెథాయ్ తుఫాన్ నేలకు తాకిన చోట మడ అడవులు ఉండడం వల్ల  తుఫాన్ తీవ్రత బాగా తగ్గిందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

పెథాయ్‌ తుఫాన్: విపక్షాల విమర్శలకు బాబు కౌంటర్