Asianet News TeluguAsianet News Telugu

గిరిజన మండలిలో ‘ దేశం’ రాజకీయం

  • గిరిజన సలహా మండలి నియామకంలో టీడీపీ రాజకీయం
  • 8మంది టీడీపీ నేతలకు మండలిలో చోటు
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు
controversy in andhrapradesh new tribal council

గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మండలిలోనూ టీడీపీ రాజకీయాలు చేస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా  గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి తన కుటిల బుద్ధిని చూపించుకుంది.

అసలేం జరిగిందంటే..  ప్రతి  రాష్ట్రానికి గిరిజన సలహా మండలి ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఏపీలో గిరిజన సలహా మండలి నియామకం జరగలేదు. అధికారంలో ఉన్న టీడీపీలో గిరిజన తెగకు చెందిన ఎమ్మెల్యేలు లేరు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం మండలి నియామకం చేపట్టలేదు. అయితే.. ఇటీవల పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారిలో గిరిజన తెగకు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు.

ఎప్పటి నుంచో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత జగన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారు. అయితే.. ఇందులోనూ తన వక్ర బుద్ధిని బయటపెట్టకుంది టీడీపీ. వైసీపీలో ఎక్కువ మంది గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు. న్యాయంగా.. మండలి సభ్యులు కూడా వాళ్లే ఉండాలి. కానీ.. అలా కాకుండా తమ పార్టీకి చెందిన 8మంది నేతలను సలహా మండలి మెంబర్లుగా నియమించాడు చంద్రబాబు. మంత్రి నక్కా ఆనందబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ మండలిలో ఎక్కవ మంది టీడీపీ నేతలకే చోటు కల్పించడం గమనార్హం.

అంతేకాకుండా ఈ గిరిజన మండలిలో ఎస్టీ కాని మాజీ ఎమ్మెల్యే జనార్థన్ తాట్రాజ్ ని నియమించడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎస్టీ కాని వ్యక్తిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నిస్తోంది.. ఇందులో కూడా రాజకీయాలు చేయడం సరికాదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios