అధికారిని కొట్టిన కాంట్రాక్టర్ (వీడియో)

అధికారిని కొట్టిన కాంట్రాక్టర్ (వీడియో)

రాజకీయ అండతో కొందరు కాంట్రాక్టర్లు అధికారులపై రెచ్చిపోవటం ఎక్కువైపోతోంది. గడచిన మూడున్నరేళ్ళుగా టిడిపి నేతలు కావచ్చు లేదా వారి మద్దతుతో కావచ్చు అధికారులపై రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు దాడులు చేయటం మామూలైపోయింది. తాజాగా అటువంటి ఘటనే అనంతపురంలో చోటు చేసుకుంది. బిల్లులు చెల్లింపుల్లో తలెత్తిన వివాదంతో కాంట్రాక్టర్ నడిరోడ్డులో ఓ డిఈపై దాడి చేయటం సంచలనంగా మారింది. రోడ్డు మీదే డీఈని పడేసి తన్నటంతో అధికారులు భయాందోళనలకు గురయ్యారు.

జరిగిందేమిటంటే, అనంతపురం మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ నరసింహారెడ్డి ఓ వర్క్ చేసారు. దానికి సంబంధించి రూ. 23 లక్షల బిల్లును అధికారులు పెండింగ్ లో ఉంచారు. బిల్లు మంజూరు చేయకుండా కాంట్రాక్టర్ ను తిప్పుతున్నారు. అదే విషయమై ఏఇ మహదేవప్రసాద్ ను కాంట్రాక్టర్ హెచ్చరించటమే కాకుండా ఆఫీసులోనే గొడవకు దిగారు. దాంతో అక్కడే ఉన్న డిఈ కిష్టప్ప కాంట్రాక్టర్ ను అడ్డుకున్నారు. దాంతో మహదేవప్రసాద్ పై కోపాన్ని కాంట్రాక్టర్ డిఈ కిష్టప్పపై చూపారు.

సాయంత్రం అధికారులు ఇంటికి వెళ్ళే సమయంలో దారి కాచి కిష్టప్పను అడ్డగిచారు. కారులో నుండి బయటకు లాగి రోడ్డుపై పడేసి తన్నారు. నడిరోడ్డుపైనే ఇదంతా జరగటంతో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్ధం కాలేదు.  డిఈని కాంట్రాక్టర్ రోడ్డుపై పడేసి తన్నటాన్ని తెలుసుకున్న ఇతర ఉద్యోగులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దాంతో ఫిర్యాదు మేరకు పోలుసులు రంగంలోకి దిగి కాంట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos