ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చాలాకాలంగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ అదిష్టానం. అందులో భాగంగానే పిసిసి పగ్గాలకు కొత్తవారికి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ (congress party) పరిస్థితి అద్వాన్నంగా తయారయిన విషయం తెలిసిందే. తెలంగాణ (telangana)లో కొంచెం నయం కానీ ఏపీ (andhra pradesh)లో అయితే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఏండ్లకు ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయంతో చతికిలపడింది. అయితే ఏపీలో కాంగ్రెస్ (ap congress) పార్టీని బలోపేతం చేయడం కోసం అదిష్టానం చర్యలు ప్రారంభించింది.
రాష్ట్ర విభజన తర్వాత విభాజ్య ఏపీకి మొట్టమొదటి పిసిసి అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి (raghuveera reddy) కొనసాగారు. ఆ తర్వాత శైలజానాథ్ (sake sailajanath) కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనను కూడా మార్చి కొత్తవారికి పిసిసి (ap pcc) పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అదిష్టానం కొందరి పేర్లను సిద్దం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు తీసుకునేందుకు ఇవాళ (మంగళవారం) ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ (umen chandi) విజయవాడ (vijayawada)కు వస్తున్నారు.
రెండు రోజుల (మంగళ, బుధ) పాటు ఉమేన్ చాందీ విజయవాడలోనే వుండనున్నారు. ఏపి పిసిసి గా ఎవరిని నియమించాలన్న దానిపై సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు.
read more ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా తిరుపతి... మాజీ కేంద్రమంత్రి చింతా కీలక వ్యాఖ్యలు
ఏపీ పీసీసీ అధ్యక్షుడిని మార్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం వున్నట్లు తెలిపి సీనియర్ నేతల సూచనలు, క్యాడర్ అభిప్రాయం తెలుసుకోవాలని ఉమెన్ చాందీ భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే కొందరి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పిసిసి రేసులో మాజీ ఎంపీ హర్షకుమార్ (harsha kumar), జెడి శీలం (jd sheelam), మస్తాన్ వలి (mastan vali), గిడుగు రుద్రరాజు(gidugi rudraraju) వున్నారు. ఒకవేళ మహిళకు పిసిసి చీఫ్ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే సుంకర పద్మశ్రీ (sunkara padmashri) కి అవకాశం దక్కనుంది.
కేంద్రం, రాష్ట్రంలో సమస్యలపై, ప్రభుత్వం అక్రమాలు, ప్రజావ్యతిరేక పాలనపై సుంకర పద్మశ్రీ పోరాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి ఉద్యమం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం వంటి అంశాలపై గట్టిగా గళం వినిపిస్తున్నారు.
read more కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు డీఎస్ వెళ్లారు- వీ.హనుమంతరావు
ఒకవేళ సుంకర పద్మశ్రీని ఎంపిక చేస్తే ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలవనున్నారు. అయితే ఉమేన్ చాంది పర్యటన తర్వాత కాంగ్రెస్ అదిష్టానం కొత్త పిసిసి ఎవరన్నది నిర్ణయించనున్నారు.
ఇటీవలే మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ (chinta mohan) త్వరలోనే ఏపి పీసీసిలో మార్పులు ఉంటాయని వెల్లడించిన విషయం తెలిసిందే. . రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి నేతల కొరత ఉందని... మచ్చలేని నాయకుడు, ప్రజా ఆమోదయోగ్యమైన నాయకుడు కావాలన్నారు. అలాంటి నాయకుడికే ఏపి పిసిసి పగ్గాలు దక్కుతాయని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.
