కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరాన్ని తీసుకున్నారా ?

First Published 5, Dec 2017, 4:16 PM IST
Congress alleges that irregularities took place in polavaram project
Highlights
  • పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి చంద్రబాబునాయుడు వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి పళ్ళంరాజు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావులు గడ్కరీతో మాట్లాడుతూ, పోలవరం విషయంలో భాజపా, టిడిపిలు నాటకాలాడుతున్నట్లు ఆరోపించారు. 2018కి పోలవరం ఎట్టి పరిస్ధితిలోనూ పూర్తి కాదని గట్టిగా చెప్పారు.  కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును చేపట్టినట్లు ఆరోపించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రాష్ట్రప్రజలు నష్టపోతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

loader