ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఉనికే లేద‌ని, బీజేపీ దీక్ష చేయడం వెనుక టీడీపీ భావజాలమే ఉందని సజ్జల విమర్శించారు. బీజేపీ కి ప్ర‌త్యేక అజెండా లేద‌ని..  టీడీపీ అజెండానే బీజేపీ మోస్తుంద‌ని  విమ‌ర్శించారు. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగున్నాయని తెలిపారు. పీఆర్సీ పై   మంగళవారం కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మరోసారి చర్చ జరిగినట్లు తెలిపారు.ఫైనాన్స్‌ అధికారులు కొన్ని ప్రతిపాదనలను సీఎం జగన్‌ ముందు ఉంచారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ దీక్ష చేయడం వెనుక టీడీపీ భావజాలమే ఉందని, బీజేపీ ఉనికే లేద‌నీ, టీడీపీ అజెండానే బీజేపీ మోస్తుంద‌ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమ‌ర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగున్నాయని తెలిపారు. రాజకీయంగా టీడీపీ పాటనే జనసేన బీజేపీ లు పడుతున్నాయని ఆరోపించారు. ఏపీలో రామ‌రాజ్యం కావాలంటే.. వైసీపీని ఫాలో కావాలంటూ విప‌క్షాల‌కు చుర‌క‌లంటించారు.

బీజేపీ కి సొంత ఆలోచన లేదని , రాష్ట్ర సమస్యల పై శ్రద్ధ లేదని ఆరోపించారు. బీజేపీ ఉనికే ఆంధ్రప్ర‌దేశ్ లో లేద‌నీ, ఒక్క‌రో.. ఇద్ద‌రో టీపీడీ ఏజెంట్ల మీద న‌డుస్తోన్న పార్టీ అని విమ‌ర్శించారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు బీజేపీ, టీపీడీ , జ‌న సేన కానీ ఒక్క సమస్యకైనా పరిష్కరం చెప్పారా ? అని ప్ర‌శ్నించారు.వాళ్ళకి వాల్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జగన్ పాలనలో రామరాజ్యం నడుస్తుందనీ, మీకు రామరాజ్యం కావాలి అంటే మమ్మల్ని ఫాలో అవ్వండని అని అన్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు సొంత ఆలోచ‌న‌ల్లేవ‌నీ.. ఒక పార్టీ ప‌ల్ల‌వి అందుకుంటే.. ఇంకో పార్టీ రాగం అందుకుంటుంద‌ని, మ‌రో పార్టీ తాళం కొడుతుంది త‌ప్పా.. నిజంగా విప‌క్షాల‌కు రాష్ట్రం మీద గానీ, రాష్ట్ర ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల మీద అవ‌గాహ‌న లేద‌ని విమ‌ర్శించారు.

Read Also : హత్యకు కుట్ర: అభిమానులే రక్ష .. గన్‌మెన్లను తిరస్కరించిన వంగవీటి రాధాకృష్ణ

పీఆర్సీ పై మంగళవారం కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మరోసారి చర్చ జరిగినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఫైనాన్స్‌ అధికారులు కొన్ని ప్రతిపాదనలను సీఎం జగన్‌ ముందు ఉంచారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. పీఆర్సీ అంశం ప్రాసెస్ లో ఉందనీ, పీఆర్సీ ఎంత శాతం ఇస్తారనే దానితో పాటు ఇతర అంశాలు చాలా పరిశీలిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. 

Read Also : ఏపీలో జైలుకెళ్లే నేతలున్నారు.. ‘‘పుష్ప’’ సినిమాను ప్రస్తావిస్తూ జవదేకర్ పంచ్‌లు

కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎం జగన్‌ ఆలోచిస్తున్నారన్నారు. ఉన్నంతలో ఎంతో కొంత అధికంగా ఇవ్వాలని ఆలోచనలో సీఎం ఉన్నారనీ, రాష్ట్రం పరిస్థితి బాలేదని , ఇదే వాస్తవమ‌ని తెలిపారు. రాజకీయంగా అయితే వెంటనే చెయ్యచ్చు.. కానీ ఇందులో చాలా అంశాలున్నాయనీ, పీఆర్సీ తో పాటు డీఏ పెండింగ్ ఉందనీ, ఇలా అన్ని అంశాలు చూడాలని, మొత్తం బరువు మీద పడకుండా చూసుకోవాలని అన్నారు. ఆర్ధిక పరిస్థితి బాలన్స్ చేస్తూ.. నిర్ణయాలు తీసుకోవాలని, కావాలని పిఆర్సీ ఆలస్యం చెయ్యడం లేదనీ, ఆర్ధిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. కాబట్టే కొంచెం ఆలస్యమవుతోందని సజ్జల తెలిపారు. త్వరలోనే పీఆర్సీపై సీఎం ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు.