Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో జైలుకెళ్లే నేతలున్నారు.. ‘‘పుష్ప’’ సినిమాను ప్రస్తావిస్తూ జవదేకర్ పంచ్‌లు

తనకు ఏపీ అంటే అమితమైన ప్రేమ అన్నారు బీజేపీ (bjp) రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. తాను కేంద్ర మంత్రిగా వున్న సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు (polavaram project) అనుమతులు ఇచ్చామని జవదేకర్ తెలిపారు. అనుమతులు ఇచ్చి ఏడేళ్లవుతున్నా, ఇప్పటికీ పూర్తి కాలేదని ఆయన దుయ్యబట్టారు. నీ

bjp mp prakash javadekar slams ap cm ys jagan in janaagraha sabha in vijayawada
Author
Amaravathi, First Published Dec 28, 2021, 5:39 PM IST

ఆంధ్రలో జైలుకు వెళ్లే నాయకులున్నారని, వారంతా బెయిల్ మీద ఉన్నారని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను, నాయకులను ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు ఏపీ అంటే అమితమైన ప్రేమ అన్నారు బీజేపీ (bjp) రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (prakash javadekar) . మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ జనాగ్రహ సభలో (bjp janaagraha sabha) ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీలో అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించానని జవదేకర్ గుర్తుచేసుకున్నారు. తాను కేంద్ర మంత్రిగా వున్న సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు (polavaram project) అనుమతులు ఇచ్చామని జవదేకర్ తెలిపారు. అనుమతులు ఇచ్చి ఏడేళ్లవుతున్నా, ఇప్పటికీ పూర్తి కాలేదని ఆయన దుయ్యబట్టారు. నీటి పంపిణీ సైతం మొదలుకాలేదన్నారు. అమరావతి రాజధాని కట్టడానికి కూడా అనుమతులు ఇచ్చానని అది కూడా పూర్తి కాలేదంటూ జవదేకర్ ధ్వజమెత్తారు. 

టీఆర్ఎస్ (trs), టీడీపీ (tdp) , వైసీపీ (ysrcp) పాలనలను చూశానని.. కుటుంబ నాయకత్వమే కనిపించిందన్నారు. రాజధాని కోసం వైసీపీ, టీడీపీ కొట్టుకుంటున్నాయని.. టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీలు కరప్షన్ పార్టీలని జవదేకర్ ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేశారని.. రామతీర్దంలో కోదండరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. ఏపీలో విధ్వంసకర పాలన జరుగుతోందని.. 2014లో మోడీ వేవ్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జవదేకర్ అన్నారు. అయితే 2019లో బీజేపీతో దూరమై టీడీపీ  ఓటమి పాలైందని ఆయన గుర్తుచేశారు. 

Also REad:అధికారమిస్తే.. మూడేళ్లలో అమరావతి నిర్మాణం, బీజేపీ ఆఫీస్ ఇక్కడే: సోము వీర్రాజు

ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం తెస్తామన్నారని.. ఇప్పుడు మద్యాన్ని అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని జవదేవకర్ ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. అవి జగనన్న కాలనీలు కాదని.. మోడీ కాలనీలని జవదేకర్ చెప్పారు. తన ప్రసంగంలో పుష్ప సినిమాను ప్రస్తావించిన  ఆయన.. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా జరిగిందో చూపించారని తెలిపారు. తాను  వచ్చే దారిలో పుష్ప (pushpa movie) పోస్టర్ చూశానని.. ఎర్రచందనం స్మగ్లింగ్ విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్‌ను ప్రభుత్వం రద్దు చేసిందని ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios