పీఆర్సీ సహా ఇతర డిమాండ్లకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు  జరిపారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . సీఎం జగన్‌తో (ys jagan) జరిపిన చర్చల సారాంశాన్ని ఉద్యోగ సంఘాలకు వివరించారు.

పీఆర్సీ సహా ఇతర డిమాండ్లకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు జరిపారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . సీఎం జగన్‌తో (ys jagan) జరిపిన చర్చల సారాంశాన్ని ఉద్యోగ సంఘాలకు వివరించారు. ఉద్యమానికి తాత్కాలికంగానే విరామం ప్రకటించామని... సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చినందుకే విరామం ప్రకటించామన్నారు. మరికొన్ని రోజులుగా పీఆర్సీపై చర్చలు జరుగుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ సందర్భంగా అమరావతి జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు (bandi srinivasa rao) మాట్లాడుతూ.. పీఆర్సీ, ఫిట్ మెంట్ పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సోమవారం నాటికి ఫిట్‌మెంట్ పై క్లారిటీ రావచ్చని... 2018 జులై 1 నుంచి ఫిట్‌మెంట్ అమలు చేయాలని కోరామని శ్రీనివాసరావు వెల్లడించారు. ఆశీతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ యథాతధంగా అమలు చేయాలని.. 50 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. 

ALso Read:AP PRC : ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె తాత్కాలిక విరమణ: ఉద్యోగ సంఘాలు

ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) మాట్లాడుతూ.. ఉద్యమాన్ని విరమించలేదని, తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పీఆర్సీ ప్రకటనకు మా ఉద్యమం ఆటంకం కాకూడదని.. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఉద్యోగుల్లో అభద్రతాభావం కలుగుతుందని బొప్పరాజు పేర్కొన్నారు. వచ్చే మంగళవారం లోపే ఫిట్‌మెంట్‌పై క్లారిటీ ఇస్తామని చెప్పారని.. ఇక నుంచి ఏ సమస్య ఉన్నా, తక్షణమే పరిష్కరించేలా ఒక ప్రత్యేక అధికారి నియమిస్తామని చెప్పారని వెంకటేశ్వర్లు తెలిపారు.