తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వెళ్లనున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయితే ఇప్పటికే సీఎం పర్యటనకు  సంబంధించిన షెడ్యూల్ ఖరారుకాగా తాజాగా అందులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 

గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకోనున్నారు. అక్కడినుండి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకోనున్న సీఎం సాయంత్రం వరకు పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్నారు.

READ MORE  తిరుమల సమాచారం... లాక్ డౌన్ తర్వాత రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

ఇక సాయంత్రం 5.27కి అన్నమయ్య భవన్ నుంచి ప్రధాని మోదీతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. సాయంత్రం 6.15కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకోనున్న ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7.30కి శ్రీవారి గరుడ సేవలో సీఎం పాల్గొననున్నారు. 

ఇక 24న ఉదయం 6.15 గంటలకు శ్రీవారిని మరోసారి దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత 7 నుంచి 8 గంటల వరకు సుందరకాండ పఠనంలో పాల్గొననున్నారు. ఉదయం 8.10కి కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమిపూజలో జగన్ పాల్గొంటారు. అదే రోజు రాత్రి 10.20కి రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయల్దేరనున్నారు.