తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళవారం 9గంటల వరకు 14,097మంది దర్శించుకున్నట్లు టిటిడి వెల్లడించింది. అలాగే స్వామివారికి 3,889 భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం 1.03 కోట్లుగా వున్నట్లు టిటిడి వెల్లడించింది. 

మరోవైపు బుధవారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన కుటుంబసమేతంగా వెళ్లి  శ్రీవారిని దర్శనాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

read more   హిందూ దేవాలయాలపై ఆగని దాడులు... అభయాంజనేయ విగ్రహాన్ని పెకిలించిన దుండగులు (వీడియో)

అనంతరం మంత్రి మేకపాటి మాట్లాడుతూ... వేకువజామునే కుటుంబ సమేతంగా తనకు స్వామివారి దర్శనభాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శ్రీవారి దర్శనంతో మనసు నిర్మలంగా ప్రశాంతతో నిండిపోయిందన్నారు. 

కోవిడ్-19 ప్రభావం పూర్తిగా తగ్గిపోయి రాష్ట్ర ప్రజలు అంతకు ముందులాగే సాధారణ, స్వేచ్ఛజీవితం పొందాలని స్వామిని కోరుకున్నట్లు మంత్రి మేకపాటి  వెల్లడించారు. శ్రీవారి దర్శనంలో మంత్రి మేకపాటితో పాటు ఆయన సతీమణి శ్రీకీర్తి, కుమార్తె కూడా ఉన్నారు.