అదీవాసీల దినోత్సవంలో పాల్గోన్న చంద్రబాబు. అదీవాసీలను అదుకుంటామని హామీ. పిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు అందిస్తామనన్న బాబు.
ముఖ్యమంత్రి చంద్రబాబు డ్యాన్స్ చేశారు, జగ్గివాసుదేవాతోనే కాదు అరకు అదీవాసీలతో కూడా డ్యాన్స్ చేయ్యగలనని నిరుపించారు బాబు. అరకులో జరగుతున్న.అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో బాబు పాల్గోన్నారు. ఈ వేడుకలను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ప్రారంభించారు.
అరకులోయలో పర్యటించిన చంద్రబాబు ఆదివాసీ గిరిజన యువతులతో కలసి డ్యాన్స్ చేశారు. ఆదివాసీల సంప్రదాయ థింసా నృత్యం చేస్తుండగా, ముఖ్యయంత్రి వారిలో కలిసిపోయి చేతులు పట్టుకుని కాసేపు నృత్యం చేశారు. వారితో గవర్నర్ నరసింహన్ కూడా కాలు కదిపారు.

అనంతరం చంద్రబాబు ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. అరకులో టీటీడీ దేవాలయాలన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆదివాసీలు తయారు చేసే ఆహార ఉత్పత్తులను అమ్మకాలకు ప్రభుత్వ చేయుతనిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఏపీలోని పట్టణాల్లో గిరిజన ఉత్పత్తుల జజార్లు ఏర్పాలు అరకును మెడికల్ హబ్‌గా తయారు చేస్తామన్నారు, అరకులో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆదీవాసీల పిల్లలకు బట్టలు, బూట్లు, స్వేటర్లు సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. గిరిజనులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా అరకు లోయ అంటే తనకెంతో ఇష్టమైన ప్రదేశమని చంద్రబాబు తెలిపారు. అనంతరం బాబు విదేశీ పర్యాటకులతో కరచాలనం చేశారు.
