అనంతపురం: అనంతపురం జిల్లాలో  టీఎన్‌ఎస్ఎఫ్, బీజేపీ కార్యకర్తల మధ్య గురువారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చేయిచేసుకొన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో  టీఎన్ఎస్‌ఎఫ్ కార్యకర్తలను తరిమేశారు. 

అనంతపురం జిల్లాలో పర్యటనకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం నాడు వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ  బస చేసిన గెస్ట్ హౌజ్ వద్ద  టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

బీజేపీకి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. ఈ సమయంలో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలకు , బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వావాదం చోటు చేసుకొంది. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఒకరిపై మరోకరు గొడవకు దిగారు. ఒకరిపై మరోకరు  చేయి చేసుకొన్నారు. 

కన్నా పర్యటనను పురస్కరించుకొని  గెస్ట్‌హౌజ్‌కు చేరుకొన్న  బీజేపీ కార్యకర్తలు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను తరిమికొట్టారు. అక్కడే  ఉన్న పోలీసులు  ఇరు వర్గాలను  అడ్డుకొన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.