:హైదరాబాద్: ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై సినీ నటుడు చంద్రబాబునాయుడు ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా తాను చంద్రబాబుతో చర్చకు సిద్దమేనని ఆయన ప్రకటించారు. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబునాయుడుపై మోహన్ బాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన విద్యాసంస్థలకు ఏమైనా జరిగితే చంద్రబాబునాయుడు కారణమని ఆయన ఆరోపించారు. తన కుటుంబం మీద చంద్రబాబునాయుడు కుట్రపూరితంగా వ్యవహరించాడన్నారు. 2013లో అధికారంలో లేని చంద్రబాబునాయుడును తన అన్ని కార్యక్రమాలకు బాబును ఆహ్వానించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

 

 

ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విషయంలో ఏదైనా ఉంటే నేరుగా తనతో మాట్లాడాలని మోహన్ బాబు కోరారు. ఇతరులతో చెప్పించొద్దన్నారు. ఈ విషయాలన్నింటిని కూడ ప్రజలు గమనిస్తున్నారని మోహన్ బాబు  చెప్పారు.

తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిందన్నారు. చంద్రబాబు జీవితం మూసి ఉన్న పుస్తకమన్నారు. ఎన్టీఆర్‌ను ఎలా మోసం చేశావో అనుక్షణం బయటపెడతానని మోహన్ బాబు హెచ్చరించారు.
 

సంబంధిత వార్తలు

నా పార్టీ అంటావేంటి, అంత అహంకారమా: బాబుపై మోహన్ బాబు నిప్పులు

చంద్రబాబు ప్రభుత్వంపై మోహన్ బాబు పోరు (వీడియో)

రోడ్డుపై బైఠాయించిన మోహన్ బాబు, మంచు మనోజ్

సినీ నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్: ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు