అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్‌ల స్కాం లో సీఐడీ విచారణను వేగవంతం చేసింది. సుమారు రూ. 112 కోట్లను నకిలీ చెక్ ల ద్వారా డ్రా చేసేందుకు ప్రయత్నించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణంపై విచారణకు సీఐడీకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఏప్రిల్ మాసం నుండి ఇప్పటివరకు 16 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారుల పేరున జారీ చేశారు. ఈ 16 వేల చెక్కులలో 976 చెక్కులు లక్ష రూపాయాల కంటే ఎక్కువ. మిగిలిన చెక్కులన్నీ లక్షలోపే లబ్దిదారుల పేర్లపై జారీ చేశారు.

2019లో జారీ చేసిన చెక్కును ఇంతవరకు డ్రా చేయని విషయాన్ని అధికారులు గుర్తించారు. సీఎంఆర్ఎఫ్ ఖాతాలో ప్రస్తుతం రూ. 90 కోట్ల మేర నిధులు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.

also read:ఏపీలో సీఎంఆర్ఎఫ్ చెక్‌ల కుంభకోణం: సీఐడీకి కేసు బదిలీ చేసే ఛాన్స్

సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్యాబ్రికేట్ చేసి డబ్బులు డ్రా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్టుగా బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ విషయమై రెవిన్యూ అసిస్టెంట్ సెక్రటరీకి సమాచారం ఇస్తే ఈ విషయం వెలుగు చూసింది. 

ఇప్పటికే రెండు రాష్ట్రాల నుండి నిందితులు డబ్బులను డ్రా చేశారు. కోల్‌కతా, మంగుళూరు, డిల్లీనుండి చెక్కులను డ్రా చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ఇప్పటికే రెండు చెక్ ల ద్వారా డబ్బులు డ్రా చేశారు.

వ్యక్తుల పేర్ల మీద కాకుండా సంస్థల పేర్ల మీద సీఎంఆర్ఎఫ్ చెక్కులు జారీ చేయడంపై అనుమానం వచ్చిన ఎస్బీఐ బ్యాంకు అధికారులు  రెవిన్యూ అసిస్టెంట్ సెక్రటరీని కలిస్తే ఈ స్కామ్ విషయం వెలుగు చూసింది.