Asianet News TeluguAsianet News Telugu

AP Cinema tickets price row.. వైఎస్ జగన్ ను కలవనున్న చిరంజీవి

ఏపీలో సినిమా టిక్కెట్ల‌ రేట్ల తగ్గింపు నిర్ణయంతో చిత్ర‌ పరిశ్రమ సంక్షోభంలో ప‌డింది. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా ఏపీలో థియేటర్లలో సోదాలు చేయ‌డం . వందలాది థియేటర్లను సీజ్ చేయడం. ఈ విష‌యంలో  సీఎం జగన్ తో మెగాస్టార్ భేటీ కానున్న‌ట్టు స‌మాచారం.
 

Chiranjeevi seeks to meet CM Jagan
Author
Hyderabad, First Published Dec 27, 2021, 11:00 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, చిత్ర‌సీమ‌కు మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతోందా?  అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీలో సినిమా రేట్ల తగ్గింపు నిర్ణయంతో చిత్ర‌ పరిశ్రమ సంక్షోభంలో ప‌డింది. ఇదే స‌మ‌యంలో ఎప్పుడు లేని విధంగా ఏపీలో పెద్ద ఎత్తున‌ థియేటర్లలో సోదాలు జరుగుతున్నాయి. అనేక థియేటర్లను సీజ్ చేశారు. దాదాపు 130 థియేటర్లకు నోటీసులు జారీ అయ్యాయి.  భారీ ఎత్తున‌ జరిమానాలు విధించించారు.

ఈ క్ర‌మంలో మరి కొందరు థియేటర్ల యజమానులు స్వచ్చందంగా తమ సినిమా థియేటర్లను మూసేస్తున్నారు. ప్ర‌స్తుతం  ప‌రిస్థితుల్లో ఇరవై ఏళ్ల క్రితం నాటి ధరలతో ఇప్పుడు సినిమాలు ప్రదర్శించలేమని వాపోతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు హీరోలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది.   

Read Also: Tirumala Darshan Tickets: శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల.. 15 నిమిషాల్లోనే హాట్ కేకుల్లా బుక్కైన టికెట్లు

ఇదిలా ఉంటే.. సంక్రాంతికి భారీబడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే మూడు కొత్త సినిమాలు నడుస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో టాలీవుడ్ సంక్షోభంలో ప‌డింది. అయితే, ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ కు గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల‌ ధరలు పెంచే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఈ క్ర‌మంలో టాలీవుడ్ ప్రముఖుల పైన ఒత్తిడి పెరిగింది. ఈ విష‌యంలో నేరుగా సీఎం జగన్ తో చర్చిస్తేనే.. ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే నిర్ణయానికి వ‌చ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ విషయంలో పరిశ్రమ తరపున మెగాస్టార్ చిరంజీవి చొర‌వ తీసుకోవాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది.  చిరు కూడా సీఎం జ‌గ‌న్ తో చర్చించ‌డానికి ఓకే చెప్పార‌ట‌. సినిమా టిక్కెట్ ధరల సమస్యపై చర్చించేందుకు ఆయన ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం.
 

Read Also:  నేడే బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష.. ఎక్కడంటే...

ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా చిరంజీవితో భేటికి సిద్దంగా ఉన్నార‌ట‌. తొలుత సమాచార, ప్రజా సంబంధాలు& సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో చర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ త‌రువాత‌.. ఇదే విష‌యంపై ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డితో చిరు భేటి జరుగుతుందని, ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా కుదిరిందట‌. మరో రెండు రోజుల్లో భేటి వుంటుందని  సమాచారం. 

ఈ భేటీలో ప్ర‌ధానంగా.. ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్‌కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చిరంజీవి స్వాగతించినప్పటికీ, సినిమా టిక్కెట్ ధరల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని, సినీ పరిశ్రమకు మేలు జ‌రిగిలా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు చిరంజీవి 
అమరావతికి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. 

Read Also: రేప‌టి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డ‌బ్బులు..

ఈ కొల్డ్ వార్  ఏపీలో వకీల్ సాబ్ నుంచి న‌డుస్తోంది. సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తే తన సినిమా ఫ్రీగా నడిపిస్తానంటూ ప‌వ‌న్ కళ్యాణ్ సవాల్ చేసారు. కానీ, త్వ‌ర‌లో పవన్ నటించిన భీమ్లా వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ కూడా రిలీజ్ కూడా డౌట్ గా ఉంది. ఒక వైపు  ఒమిక్రాన్... కలెక్షన్ల ప్రభావం పడుతుందనే టెన్షన్ పెరిగిపోతోంది. టికెట్ ధ‌ర‌ల విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం సనూకూలంగా స్పందించినట్లే.. ఏపీ ప్రభుత్వం కూడా పరిశ్రమ కష్టాన్ని అర్ధం చేసుకొని నిర్ణయం తీసుకుంటుదని చిరు ఆశ భావంలో వున్నారని తెలిసింది. ఈ రెండు రోజుల్లో టికెట్ల సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే వుంది.

Follow Us:
Download App:
  • android
  • ios