Asianet News TeluguAsianet News Telugu

రేప‌టి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డ‌బ్బులు..

రేపటి నుంచి తెలంగాణ రైతులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించనుంది. ఒకరం భూమి ఉన్న రైతులకు మొదటి రోజు, రెండు ఎకరాలు ఉన్న రైతులకు రెండో రోజు ఇలా విడతల వారీగా రైతుల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమకానున్నాయి. 

Farmer bond money into farmers' accounts from tomorrow ..
Author
Hyderabad, First Published Dec 27, 2021, 9:59 AM IST

రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతుబంధు పెట్టుబ‌డి సాయం రేప‌టి నుంచి రైతుల ఖాతాల్లోకి జ‌మ కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి రైతుబంధు ప‌థ‌కానికి నిధులు విడుద‌ల చేస్తాన‌ని ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో రేప‌టి నుంచి ఆ నిధుల‌ను రైతుల ఖాతాల్లోకి పంపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజ‌న్ లో రైతుబంధు కోసం రూ.7600 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని వ్య‌వ‌సాయ శాఖ అంచ‌నా వేసింది. అందులో భాగంగానే ఆ నిధుల‌ను స‌మ‌కూర్చుకుంది. గ‌తంలో మాదిరిగానే ఈ సారి కూడా త‌క్కువ ఎక‌రాలు ఉన్న రైతులకు ముందుగా త‌రువాత ఎక్కువ ఎక‌రాలు ఉన్న రైతులకు విడ‌త‌ల వారీగా పెట్టుబ‌డి సాయం అందించ‌నున్నారు. ఎక‌రం ఉన్న రైతుల‌కు మొద‌టి రోజు, రెండు ఎక‌రాలు ఉన్న రైతులకు రెండో రోజు ఇలా నిధులు జ‌మకానున్నాయి. 

నేడే బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష.. ఎక్కడంటే...

కొత్త‌గా పాసుబుక్కులు వ‌చ్చిన రైతులు కూడా..
ఈ సీజన్ లో కొత్తగా పాసుబుక్కులు పొందిన రైతులకు కూడా సారి రైతుబంధు నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 17వ తేదీనే ప్రభుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. గ‌త సీజ‌న్ లో రైతుబంధు జ‌మ చేసిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 17 నుంచి 22 వేల మంది వ‌ర‌కు కొత్తగా భూములు కొనుగోలు చేసి ఉంటార‌ని తెలంగాణ ప్ర‌భుత్వం అంచనా వేసింది. అయితే ఈ సారి వారికి కూడా పెట్టుబ‌డి సాయం అందించాల‌ని చూస్తోంది. త‌హీసీల్దార్ కార్యాలయాల్లోనే భూముల రిజిస్ట్రేష‌న్ అవుతుండ‌టంతో భూముల క్ర‌య విక్ర‌యాలు వెను వెంట‌నే ప్రభుత్వానికి చేరిపోతున్నాయి. అయితే కొత్త గా భూమి కొనుగోలు చేసిన వారికి కూడా ల‌బ్ది జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త‌గా పాస్ బుక్ పొందిన రైతులంద‌రూ ఆయా గ్రామాల్లో ఉండే ఏఈవోల వ‌ద్ద‌కు వెళ్లి రైతుబంధు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఏఈవోలు ఆన్ లైన్ లో న‌మోదు చేయ‌నున్నారు. ఇలా ఆన్‌లైన్ లో న‌మోదు చేయ‌డానికి ఈ నెల 31వ తేదీ క‌టాఫ్ గా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈలోపు ద‌ర‌ఖాస్తు చేసుకున్న రైతులంద‌రికీ రైతుబంధు పెట్టుబ‌డి సాయం అందించ‌నుంది. అయితే వారికి 31వ తేదీ త‌రువాత అంటే వ‌చ్చే నెల మొద‌టి వారం నుంచి రైతుబంధు అంద‌నుంది. 

ఎర్రవల్లి రచ్చబండ ఎఫెక్ట్... TPCC Chief Revanth Reddy ఇంటికి భారీగా పోలీసులు, ఉద్రిక్తత

తెలంగాణ రైతుల మ‌న్న‌న‌లు పొందిన ప‌థ‌కం రైతుబంధు. ఈ ప‌థకం కింద ఏడాదికి ఎక‌రానికి రూ.10 వేల చొప్పున ప్ర‌భుత్వం పెట్టుబడి సాయంగా అంద‌జేస్తుంది. ప్ర‌తీ ఏడాది వానాకాలం పంట వేసే ముందు ఒక సారి, యాసంగి లో పంట వేసే ముందు రెండో సారి పెట్టుబ‌డి సాయం అంద‌జేస్తోంది.2018 మే 18వ తేదీన ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని నిర్విరామంగా అమ‌లు చేస్తున్నది. ఈ ఏడాది కూడా ఈ రైతు బంధు ప‌థ‌కం అమ‌లు కోసం 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రూ. 14,800 కోట్లు కేటాయించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios