Nara Lokesh | జగన్ పాలన నియంత పాలనకు నిదర్శనం: నారా లోకేష్
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరో సారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ పాలన నియంత పాలనకు నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో సీఐడీ వ్యవహరిస్తున్న తీరుపైనా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రజా సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. శుక్రవారం నాడు సీఎం జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన నియంత పాలనకు నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ యల్లపు సంతోష్.. తన భార్యను ఆస్పత్రిలో చేర్చారు. నిండు గర్భిణి సంతోష్ భార్యని ఆస్పత్రిలో డెలివరీ కోసం చేర్చారు. సంతోష్‌ను పోలీసులు ఆస్పత్రిలోనే అదుపులోకి తీసుకోవడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదిలాగ సీఐడీ పోలీసులు(Crime Investigation Department) సంతోష్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో అవ్వకుండా.. వైసీపీ పెద్దల కళ్లలో ఆనందం చూసేందుకు సీఐడీ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం ఆపండి.. జగన్ సర్కార్‌కు ఎన్జీటీ షాక్
సోషల్ మీడియా యాక్టివిస్ట్ సంతోష్, ఆయన భార్యకి ఏమి జరిగినా పూర్తిగా Crime Investigation Department అధికారులదే (సీఐడీ) అని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు, తమ కడుపు మండి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టే యాక్టివిస్టులను టెర్రరిస్టుల్లా అరెస్టు చేయిస్తారా? అని నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. "సోషల్‌మీడియా యాక్టివిస్ట్ యల్లపు సంతోష్ నిండుగర్భిణి అయిన భార్యని ఆస్పత్రిలో డెలివరీ కోసం చేర్చగా, ఉగ్రవాదిలాగ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కనీసం నోటీసు ఇవ్వకుండా, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో అవ్వకుండా.. వైసీపీ పెద్దల కళ్లలో ఆనందం చూసేందుకు సీఐడీ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం. సంతోష్, ఆయన భార్యకి ఏమి జరిగినా పూర్తిగా సీఐడీదే బాధ్యత. కడుపుమండి సోషల్‌మీడియాలో పోస్టు పెడితే అరెస్టులా అంటూ విస్తుపోయిన సీఎం @ysjagan గారూ, ఆయన తాబేదార్లు.. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టే యాక్టివిస్టులను టెర్రరిస్టుల్లా అరెస్టు చేయిస్తారా?" అంటూ ట్వీట్ చేశారు.
Also Read: Data protection Bill: పార్లమెంట్ ముందుకు డేటా ప్రొటెక్షన్ బిల్లు.. కీలక అంశాలివిగో..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం ఈ ఘటనపై స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు, వీడియోలు పెట్టారంటూ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు సంతోషన్‌ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ ప్రయత్నించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడానికి వచ్చారని.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు గర్భిణి అయిన భార్యకి ఆస్పత్రిలో తోడుగా ఉన్న యువకుడిని అరెస్టు చేయాలని చూశారంటూ ఆరోపించారు. ఏమైనా ఉంటే నోటుసు ఇవ్వాలనీ, అలా చేయకుండా బెదిరింపులకు గురిచేస్తూ.. నిర్బంధంలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం రాజకీయ హీటును పెంచుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరోజు దీక్షకు సైతం దిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సైతం కార్మికులతో కలిసి విశాఖ ఉక్కు ప్యాక్టరీ ప్రయివేటీకరణ ఆపాలంటూ భారీ ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నదని సమాచారం.
Also Read: Japan Fire accident: భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి