Data protection Bill: పార్లమెంట్ ముందుకు డేటా ప్రొటెక్షన్ బిల్లు.. కీలక అంశాలివిగో..
Data protection Bill: గత కొంత కాలంగా డేటా ప్రొటక్షన్ కు సంబంధించిన అంశాలపై దేశంలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం Data protection Bill పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారం, డేటాకు మరింత రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన 'పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2019' ముసాయిదా పార్లమెంట్ సమక్షానికి రాగా, అందులో JPC పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
Data protection Bill: కేంద్ర ప్రభుత్వం Data protection Billను పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారం, డేటాకు మరింత రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన 'పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2019' ముసాయిదా పార్లమెంట్ సమక్షానికి రాగా, అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. Data protection Bill కి సంబంధించిన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి (JPC) ఈ బిల్లును రాజ్యసభ, లోక్‌సభల్లోకి తీసుకువచ్చింది. Data protection Bill పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి పీపీ చౌదరి సారథ్యాన్ని వహించారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేష్, లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు పీపీ చౌదరి.. దీన్ని ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. 2019లో Data protection Bill ను రూపొందించారు. దీని రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం 30 మంది సభ్యులతో కూడిన ఈ ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దీనిని ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు.
Also Read: Japan Fire accident: భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి
Data protection Billను పార్లమెంట్లో ప్రవేశపెట్టేముందు రెండు సభల్లోనూ రభస కొనసాగింది. పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంటోంది. ఇటీవల పలు పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలంటూ ఇరు సభల్లోనూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. ఇక రాజ్యసభలో అయితే, సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచీ గందరగోళం నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన లకింపూర్ ఖేరీ ఘటన సైతం పార్లమెంట్‌ను కుదిపేసింది. లఖింపూర్ ఖేరీ ఉదంతంపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేనిపై చర్యలు తీసుకోవాలంటూ లోక్‌సభలో డిమాండ్ కొనసాగుతోంది. ఉభయ సభల్లోనూ ఈ గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలోనే Data protection Bill రెండు సభల ముందుకు వచ్చింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
Also Read: CM KCR: కేంద్రంపై పోరు.. నేడు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించింది పార్లమెంటరీ కమిటీ. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, కంపెనీలను నియంత్రించాలంటూ ఈ కమిటీ సిఫారసు చేసింది. సోషల్ మీడియాను నియంత్రించడానికి ప్రత్యేకంగా రెగ్యులేటరీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి కంపెనీలు భారత్‌లో పూర్తిస్థాయిలో తమ కార్యాలయాలను నెలకొల్పుకొనేంత వరకు, వాటిని కార్యకలాపాలపై ఆంక్షలు విధించే దిశగా ముందుకు సాగాలని పేర్కొంది. గుర్తుతెలియని అకౌంట్ల ద్వారా తప్పుడు సమాచారం విస్తృతంగా ప్రచారం అవుతోంది. కాబట్టి సోషల్ మీడియా అకౌంట్స్‌ను తప్పనిసరిగా పరిశీలించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఇక వినియోగదారులు చేసే పోస్టులకు యాజమాన్యమే బాధ్యత వహించే విషయాన్ని సైతం ప్రస్తావించింది. సోషల్ మీడియా యూజర్ల అకౌంట్లను వెరిఫై చేయకపోతే.. అందులో పోస్ట్ అయ్యే సమాచారానికి పూర్తి బాధ్యతను సంబంధిత కంపెనీ యాజమాన్యమే వహించాల్సి ఉంటుందని జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది. డేటాను దుర్వినియోగం చేసిన వారిపై లింగభేదం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యక్తిగత డేటా విషయంలో.. సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా డేటాను ప్రాసెస్ చేసే వీలు ఉండకూడదని Data protection Bill పై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది.
Also Read: omicron : భారత్‌లో సెంచరీకి చేరువలో ఒమిక్రాన్ కేసులు..