యాత్రలో ఆయన 1253 గ్రామాలను,162 మండలాలను 16 అసెంబ్లీ నియోజకవర్గాలు 5 మునిసిపల్ కార్పొరేషన్లలో ప్రజలను కలుసుకున్నారు

ప్రతిపక్షనేతగా నారా చంద్రబాబు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర చేసి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, నేతలు, అభిమానులు తరలివచ్చారు. 2012 వ సంవత్సరం అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి రోజున హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర గాంధీ సంప్రదాయం. 2009 రెండో సారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ఛిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో ప్రజలకు భవిష్యత్తు మీద భరోసా ఇచ్చేందుకు ఈ యాత్ర ప్రారంభించారు. అందుకే ఈ యాత్రకు ‘వస్తున్నా... మీకోసం’ అని పేరు పెట్టారు. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలలోగుండా 2817కిలోమీటర్లు పాదయాత్ర చేసి రికార్డ్ నెలకొల్పారు. మొదటి రోజున ఆయన ఎనిమిది కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత ప్రతిరోజూ ఆయన 12 నుంచి 15 కిమీ నడిచేవారు. నడకకి డుయోమాక్స్ షూ ధరించారు. ఆయన వెంబడి దాదాపు వేయి మంది కార్యకర్తులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. డాకర్లు, వంటవాళ్లని తీసుకెళ్లినా, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్ పి జి) రక్షణను తీసుకోలేదు.

యాత్రలో ఆయన 1253 గ్రామాలను , 162 మండలాలను 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలను కలుసుకున్నారు. మరొక 5 మునిసిపల్ కార్పొరేషన్ల గుండా యాత్ర సాగించారు. రాష్ట్రంలో సుధీర్ఘ రాజకీయ పాదయాత్రగా ‘వస్తున్నా... మీకోసం’ చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే, ఏ నాయకుడు నడస్తూ రాజకీయ క్యాంపెయిన్ ఇలా చేసిన దాఖలా లేదు. అంతకుముందు 2003లో కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సాగింది 1500 కి.మీ దూరమే. రాజశేఖర్ రెడ్డి రంగారెడ్డి చేవెళ్ల నుంచి యాత్ర ప్రారంభించారు. ‘ జాతీయ స్థాయిలో మాజీ ప్రధాని చంద్రశేఖర్ మాత్రమే సుదీర్ఘ పాదయాత్ర చేశారు. న్యూఢిల్లీ లోని రాజ్ ఘాట్ నుంచి కన్యాకుమారి దాకా 4260కి.మీ చంద్రశేఖర్ యాత్ర కొనసాగింది. ఈ యాత్ర జనవరి 6,1983న మొదలయి, జూన్ 25,1983న ముగిసింది. ఆతర్వాత రికార్డు చంద్రబాబు నాయుడిదే,’ అని రాష్ట్ర సమాచార శాఖమంత్రి కాల్వ శ్రీనివాసులు ‘ఏషియానెట్ తెలుగు’ కు చెప్పారు. చంద్రశేఖర్ యాత్రలో ప్రజలతో సమస్యల గురించి మాట్లాడటం, తెలుసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు ప్రతి చోట ప్రజలతో చర్చించేందుకే యాత్ర జరిపారు,’ అని శ్రీనివాసులు చెప్పారు.
చంద్రబాబు పాదయాత్ర 2013 ఏప్రిల్ 28న విశాఖలోని అగనంపూడి వద్ద ముగిసింది. ఆయన వెంటన భార్య భువనేశ్వరి, కుమారుడులోకేశ్ , బావమరిది బాలకృష్ణ ఉన్నారు. అనంతపురానికి చెందిన టిడిపి నేత టి వసంత నాయుడు ఈ యాత్రకు గుర్తుగా 2 కిలో వెండితో చేసిన పాదరక్షలను చంద్రబాబుకు బహూకరించారు. క్రిక్కిరిసిన అభిమానుల మధ్య ఈ యాత్రను ఆయన ప్రజలనుద్దేశించి ప్రసగించి ముగించారు. తర్వాత 2014లో ఏమయిందో అందరికీ తెలుసు.
