వైసీపీ వాళ్లు గాలికొచ్చారు.. గాలికే పోతారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
అమరావతి:వైసీపీ వాళ్లు గాలికొచ్చారు.. గాలికే పోతారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. సోమవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వరద నష్టంపై ప్రభుత్వం గాలి కబుర్లు చెబుతోందన్నారు. రైతులకు వరద సహాయం విషయంలో ప్రభుత్వ సమాధానం మోసపూరిత ప్రకటనలేనని ఆయన విమర్శించారు.
తమ శాసనసభపక్షఉప నేత రామానాయుడు అసెంబ్లీలో మాట్లాడే సమయంలో సీఎం జగన్ ఏం మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో సీఎం జగన్ స్పందించే దీరు అదేనా అని ఆయన అడిగారు. అసెంబ్లీలో జగన్ రామానాయుడునుద్దేశించి చేసిన వీడియోను మీడియా సమావేశంలో ఆయన చూపించారు.
సభలో సీఎం తీరుతో తనకు మొదటిసారి కోపం వచ్చిందన్నారు. అందుకే తాను పోడియం ముందు వెళ్లి బైఠాయించినట్టుగా ఆయన చెప్పారు. రైతుల ఆవేదన వారికి జరిగిన కష్టాన్ని చూసి పోడియం వద్దకు వచ్చినట్టుగా తెలిపారు.
also read:సరైన సమయంలో చర్యలు: స్పీకర్, బాబు తీరును ఆక్షేపిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం
గతంలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పరిటాల రవీంద్ర హత్య జరిగిన సమయంలో తాను స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చే ముఖ్యమంత్రిని తొలిసారిగా చూస్తున్నానన్నారు. బిల్లులపై చర్చిద్దామని ఎంత చెప్పినా కూడ ప్రభుత్వం వినలేదని ఆయన విమర్శించారు.
జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రి అని ఆయన అభివర్ణించారు.తప్పుడు ప్రకటనలు ఇస్తున్న సీఎంను తాను తొలిసారిగా చూస్తున్నామని చెప్పారు.తన రాజకీయ అనుభవమంతా లేదు.. నీ వయస్సు అంటూ జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ప్రతి రోజూ అవమానాలు భరించాలా... ప్రతిపక్షనాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. రోజూ మీ చేతిలో అవమానాలు భరించాలా అని ఆయన అడిగారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా సభలో వైసీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారన్నారు. తమ సభ్యుల్ని వెక్కిరిస్తున్నారని ఆయన విమర్శించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 30, 2020, 5:34 PM IST