Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు గుండె సైజు పెరిగింది: ఏపీ హైకోర్టుకు హెల్త్ రిపోర్టు అందజేత

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  ఈ మాసంలో  హైద్రాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను  ఏపీ హైకోర్టుకు అందించారు బాబు న్యాయవాదులు.

Chandrababunaidu  lawyer Submits Helath report to Andhra Pradesh High court lns
Author
First Published Nov 15, 2023, 5:24 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు.చంద్రబాబుకు  నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని మెమో రూపంలో  ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు  ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు అందించారు.

ఈ ఏడాది అక్టోబర్  31న చంద్రబాబుకు  ఆరోగ్య కారణాలతో  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని కూడ  ఏపీ హైకోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలపై నివేదికను అందించారు ఆయన తరపు న్యాయవాదులు.చంద్రబాబుకు జరిగిన వైద్య పరీక్షలు,  కంటికి జరిగిన కాటరాక్ట్ ఆపరేషన్ కు సంబంధించిన వవరాలను  ఏపీ హైకోర్టుకు  అందించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. వైద్యుల సూచనలతో కూడిన నివేదికలను మెమో ద్వారా న్యాయస్థానానికి అందించారు. కుడి కంటికి శస్త్ర చికిత్స నిర్వహించారు.

చంద్రబాబుకు జరిగిన వైద్య పరీక్షలు,  కంటికి జరిగిన కాటరాక్ట్ ఆపరేషన్ కు సంబంధించిన వవరాలను  ఏపీ హైకోర్టుకు  అందించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. వైద్యుల సూచనలతో కూడిన నివేదికలను మెమో ద్వారా న్యాయస్థానానికి అందించారు. కుడి కంటికి శస్త్ర చికిత్స నిర్వహించారు.చికిత్స తర్వాత సంతృప్తి కారంగా కంటి పని తీరు ఉందని తెలిపారు. 

also read:స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్: విచారణ రేపటికి వాయిదా

అనారోగ్య సమస్యల నుండి కోలుకునేందుకు మందులు క్రమం తప్పకుండా వాడాలని వైద్యులు సూచించారన్నారు.అయిదు వారాల పాటు  కంటి పరీక్ష  కోసం డాక్టర్లు షెడ్యూల్ ఇచ్చారు.ఐదు వారాలపాటు ఆపరేషన్ చేసిన కంటికి ఇన్ ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలని వైద్యులు సూచించారని  చంద్రబాబు న్యాయవాదులు  మెమోలో పేర్కొన్నారు.  అంతేకాదు  ఐదు వారాల పాటు  కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని సూచించారన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు నిర్వహించిన ఇతర వైద్య పరీక్షల్లో  గుండె సైజు పెరిగిన విషయం తేలిందని  న్యాయవాదులు తెలిపారు. 

ఇదిలా ఉంటే చంద్రబాబుకు నిర్వహించిన ఇతర వైద్య పరీక్షల్లో  గుండె సైజు పెరిగిన విషయం తేలిందని  న్యాయవాదులు తెలిపారు.  గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాలాలలో సమస్యలు వున్నాయని తేలిందని న్యాయవాదులు ఆ మెమోలో పేర్కొన్నారు. గుండె కవాటాలకు సమస్యలు ఉన్నాయన్నారు.  తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని ఆ మెమోలో పేర్కొన్నారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో వుండాలని వైద్యులు సూచించారని ఆ మెమోలో న్యాయవాదులు తెలిపారు.24 గంటల పాటు వైద్య నిపుణుల అందుబాటులో ఉండాలని సూచించిన విషయాన్ని తెలిపారు.  షుగర్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు  జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారని  న్యాయవాదులు ఆ మెమోలో  వివరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios