ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షను మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత హెచ్.డి.దేవేగౌడ విరమింపజేశారు. దీక్ష ముగింపు సందర్భంగా హాజరైన ఆయన చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 

దీంతో చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ముగిసింది. చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలతో కూడా జాతీయ స్థాయి పార్టీనేతలు దీక్షను విరమింపజేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజనచట్టంలోని హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 8గంటలకు చంద్రబాబు నాయుడు ఏపీభవన్ లో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలు జాతీయ పార్టీ నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు. 

చంద్రబాబు వెంట తాము ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వం మారబోతుందని వచ్చే ప్రభుత్వంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు నేతలు. అనంతరం రాత్రి 8 గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడ నిమ్మరసం ఇచ్చి చంద్రబాబు దీక్షను విరమింపజేశారు. 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ నేతలకు తనకు మద్దతు పలికిన అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ నుంచి తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు. మెుత్తానికి చంద్రబాబు నాయుడు 12 గంటలపాటు దీక్ష చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నువ్వు భయపెడితే తిరగబడతాం, నిన్ను వదిలిపెట్టను: మోదీపై చంద్రబాబు

 

దేశమంతా మనవైపే ఉంది, నైతిక విజయం మనదే: చంద్రబాబు

హోదాపై రాజీలేని పోరాటం చేస్తా, అధైర్యపడొద్దు: చంద్రబాబు పిలుపు