ఒంగోలు: తన జీవితం తెరిచిన పుస్తకం ఎప్పుడూ తప్పు చేయలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. అధికారంలో ఉన్న సమయంలో తన కుటుంబం కోసం కానీ, తన మనుషుల కోసం ఏనాడూ పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Also read:19 నుంచి చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర: ఒంగోలు నుంచి శ్రీకారం

ఒంగోలు జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని బొప్పూడి గ్రామంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రజా చైనతన్య యాత్రను బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబునాయుడు ప్రసంగించారు. 

ఎన్నికల సమయంలో  మిమ్మల్ని  ఏదో మాయ ఆవరించిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఎన్నికల ముందు జగన్ కోరాడు. జగన్ మాటలను నమ్మి మీరు ఆయనకు ఓట్లు వేశారు. ఇప్పుడు  ఆ పర్యవసానాలను అనుభవిస్తున్నారని  చంద్రబాబు చెప్పారు.

తమ ప్రభుత్వం హయంలో అన్ని వర్గాలకు పెన్షన్లు  ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు తీసేసి వృద్ధుల ప్రాణాలను  బలిగొంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

అమరావతి అంటే జగన్‌కు ఎందుకంత కోపం అని ఆయన ప్రశ్నించారు. పిచ్చి తుగ్లక్ చేతిలో రాష్ట్రం అపహస్యం పాలౌతోందన్నారు బాబు.  ఒక్క కులం అంటూ  టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ అన్ని కులాలకు చెందిన పార్టీ అని బాబు  గుర్తు చేశారు. సామాజిక న్యాయంకోసం కట్టుబడిన పార్టీ టీడీపీ  అని ఆయన చెప్పారు.

కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే రేషన్ కట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. అమరావతి, పోలవరం మనకు రెండు కళ్లు లాంటివని బాబు  తెలిపారు.
రైతులకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరికీ కూడ అన్యాయం జరిగినట్టేనని బాబు అభిప్రాయపడ్డారు.  

ఇసుక, సిమెంట్, మద్యం ధరలను పెంచి ప్రజలపై విపరీతమైన భారం మోపాడన్నారు.నిరుద్యోగ భృతి, స్కాలర్‌షి‌ప్‌లు ఇవ్వడం లేదన్నారు. అమరావతి, పోలవరం మనకు రెండు కళ్లలాంటివన్నారు. అమరావతిని చంపేశారు, పోలవరం ప్రాజెక్టును ముంచెశారని బాబు సెటైర్లు వేశారు. 

అమరావతిపై ఎందుకంత కోపం అని జగన్ ను బాబు ప్రశ్నించారు. అమరావతిలో ఒకే సామాజికవర్గం వాళ్లు ఉన్నారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. అమరావతిని స్మశానం అంటూ ప్రచారం చేసిన మంత్రులు.. అదే స్మశానంలో కూర్చొని  ఎలా పనిచేస్తున్నారో చెప్పాలన్నారు. 

తాను అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు  వీళ్లు పాదయాత్రలు చేసేవాళ్లా అని  వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.అభివృద్ది, సంక్షేమం ఆగిపోయిందన్నారు బాబు.  బెదిరించి కియా పరిశ్రమను ఏపీ నుండి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు.