నంద్యాల ఘటన పై స్పంధించిన రఘువీరా కాల్పుల కు కారణం వైసీపి, టీడీపీనే అని వ్యాఖ్య. జగన్, చంద్రబాబు ప్యాక్షనిజాన్ని మళ్లి రెచ్చగొడుతున్నారు.

రాయ‌ల‌సీమ‌లో అంతరించిపోతున్న ఫ్యాక్షనిజాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, వైసీపి అధినేత‌ జ‌గ‌న్‌ మళ్లీ రెచ్చగొడుతున్నారని ఎపీపీసీసీ చీఫ్ ర‌ఘువీరా రెడ్డి ఆరోపించారు. నంద్యాల కాల్పుల ఘటనకు.. చంద్రబాబు, జగన్‌ బాధ్యత వహించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ శ్రేణుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌న పై ర‌ఘువీరా స్పంధించారు.


సాధార‌ణంగా జ‌రగాల్సిన నంద్యాల‌ ఉప ఎన్నిక‌ను ఇరు పార్టిలు ప్ర‌తిష్టాత్మకంగా తీసుకోని, అక్క‌డ ప్ర‌జ‌ల‌ను, నాయకుల‌ను రెచ్చ‌గొట్టి రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. టీడీపీ, వైసీపీలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని ఆయన విరుచుకుప‌డ్డారు. ఇలాంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి పార్టిల‌కు, వ్య‌క్తుల‌కు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌లు తగిన బుద్ది చెప్పాల‌ని సూచించారు. 

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి