పార్లమెంటులో చంద్రబాబు బిజీ బిజీ

పార్లమెంటులో చంద్రబాబు బిజీ బిజీ

పార్లమెంటులో చంద్రబాబునాయుడు బిజీగా ఉన్నారు. ప్రత్యేకహోదా, కేంద్రంపై ప్రవేశసపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యేందుకు చంద్రబాబు సోమవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాలు పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు.

మోదీ సర్కార్‌పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన బీజేపీయేతర పార్టీల ఫ్లోర్‌లీడర్లను పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. అలాగే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లను కోరారు.

ఫరూక్‌ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, జితేందర్‌రెడ్డి, వీరప్పమొయిలీ, రాజీవ్‌ సాతీవ్‌‌తో పాటు టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌ను చంద్రబాబు కలుసుకున్నారు. విభజన చట్టం, హామీల అమలు, ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాన్ని అందిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos