చంద్రబాబుకు చిక్కులు: దొంగస్వామికి దండాలు, కేసులు ఇవీ...

చంద్రబాబుకు చిక్కులు: దొంగస్వామికి దండాలు, కేసులు ఇవీ...

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ దొంగ స్వామీజికి దండాలు పెట్టడం వివాదంగా మారింది. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ స్వామీజి గురించి ఏమీ తెలుసుకోకుండానే చంద్రబాబు అతనికి దండాలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

విశాఖ విమానాశ్రయంలో గత మంగళవారం జరిగిన ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పారటీ ధర్మపోరాట సభ సందర్భంగా విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును విమానాశ్రయంలో దొంగ స్వామి కలుసుకున్నారు. తాను శంకర విద్యానంద సరస్వతినని, అమ్మవారి ఉపాసకుడినని చెబుకున్నారు. 

దాన్ని నమ్మేసి చంద్రబాబు అతని పట్ల భక్తిప్రపత్తులు ప్రదర్శించారు. శంకర సదానంద స్వామి అలియాస్‌ శంకరస్వామి అలియాస్‌ శ్రీ శంకర విద్యానంద సరస్వతిస్వామి నేరచరిత్ర ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. 

014 మే నెలలో పోలీసు జీపు నుంచి వైర్‌లెస్‌ సెట్, మైక్రో ఫోన్, వాకీటాకీ తదితర సామగ్రి అపహరించాడని విశాఖ నాలుగో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైంది. దీంతో అతనిని సీఐ లక్ష్మణరావు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. ఆ కేసు ఇంకా నడుస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి.

 శంకరస్వామి రాత్రిపూట బీచ్‌రోడ్‌లో బ్లూలైట్‌ ఉన్న కారులో తిరుగుతూ మఫ్టీలో ఉన్న పోలీస్‌ అధికారినని ప్రజలను భయపెట్టిన దాఖలాలు ఉన్నాయంటూ సాక్షి మీడియా రాసింది.

ఇటీవల ఓ కారు షోరూమ్‌కు వెళ్లి ఐదు వేలు అడ్వాన్స్, మిగిలిన మొత్తానికి పోస్ట్‌డేటెడ్‌ చెక్‌తో కారు కొనుగోలు చేసి అతను నయాపైసా కూడా చెల్లించలేదు. దీంతో షోరూమ్‌ వారు వాహనాన్ని వెనక్కి తీసేసుకున్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page