అమరావతి: 16 నెలల కాలంలో వైసీపీ చేసిన అవినీతిపై  సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు డిమాండ్ చేశాడు.

శుక్రవారం నాడు నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో  పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు ప్రసంగించారు. దేవుడి కార్యక్రమానికి ఆంక్షలు పెడుతున్నారు.. మీ తండ్రి వర్థంతికి ప్రత్యేక జీవోలు ఇస్తారా అని ఆయన జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. 

also read:రాజకీయాల్లో చేరి తప్పు చేశా, వద్దన్నా బాబు వినలేదు: మురళీమోహన్ సంచలనం

విశాఖ భూముల్లో వైసీపీ వన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడిందన్నారు. నాసిరకం మద్యం బ్రాండ్ల వన్‌సైడ్  ట్రేడింగ్ పై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాడులు, దౌర్జన్యాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైసీపీకి దూరమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. 

దేవాలయాలపై దాడులు, దౌర్జన్యాలను తాను గతంలో ఏనాడూ చూడలేదన్నారు.  దేవుళ్లకు కూడ వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. పల్నాడులో వైసీపీ నేతల దుర్మార్గాలకు కూడ అంతు లేకుండా పోయిందని ఆయన చెప్పారు.వైసీపీ చేస్తున్న దాడులు, దౌర్జన్యాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.