వ్యతిరేకించాలి: కర్ణాటక తెలుగువారికి చంద్రబాబు పిలుపు

వ్యతిరేకించాలి: కర్ణాటక తెలుగువారికి చంద్రబాబు పిలుపు

అమరావతి: తెలుగువారికి అన్యాయం చేస్తున్నవారిని వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బిజెపికి ఓటు వేయవద్దని ఆయన కర్ణాటక ప్రజలకు ఆ విధంగా పిలుపునిచ్చారని భావించాల్సి ఉంటుంది. 

గవర్నర్ వ్యవస్థను తాము మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామని, రామ్ లాల్ పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్నే రద్దు చేశారని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. వైసిపి, బిజెపి కుట్రలు చేస్తున్నాయని, ప్రతి కుట్రనూ సమర్థంగా ఎదుర్కుంటూ వచ్చామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. 

వైసిపి, బిజెపిలది మొన్నటి వరకు రహస్య ఎజెండా అని, ఇప్పుడు బహిర్గతమైందని అన్నారు. అవినీతి కేసుల్లో ఏ1, ఏ2లకు అపాయింట్ మెంట్ ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసిపిని చూసే బిజెపి టిడిపిని దూరం చేసుకుందని ఆయన అన్నారు. కేంద్రం చాలా నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు.

బీసీలకు న్యాయం చేసింది టీడిపియేనని చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 9 మంది బీసీలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించినట్లు తెలిపారు. మన దగ్గర పనిచేసినంత వరకు అద్భుతమని కితాబు ఇచ్చిన అధికారులు ఇప్పుడు వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తున్నారని ఆయన అన్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos