సస్పెండ్ చేసినా..వెనక్కి తగ్గద్దు

Chandrababu asked MPs to intensify protest in the parliament
Highlights

  • ఎంపీలతో అమరావతిలో సమావేశం నిర్వహిస్తానని, తదుపరి విషయాలు అక్కడ చర్చించుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్రప్రయోజనాల కోసం నిరసనలు, ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని తన పార్టీ ఎంపీలకు చంద్రబాబునాయుడు సూచించారు. పార్లమెంట్ ప్రారంభం కాగానే, సభలో ఉండే ఆందోళన సాగించాలని, మరింతగా నిరసన తెలపాలని సూచించిన ఆయన, సస్పెండ్ చేసినా ఫర్వాలేదని సభ్యులను సస్పెండ్ చేస్తే, పార్లమెంట్ బయట ఆందోళన కొనసాగించాలని అన్నారు. సాయంత్రంలోగా  కేంద్రం నుంచి ఏదైనా సానుకూల స్పందన వస్తుందేమో వేచి చూద్దామన్నారు. సభ వాయిదా పడిన తరువాత అందరు ఎంపీలతో అమరావతిలో సమావేశం నిర్వహిస్తానని, తదుపరి విషయాలు అక్కడ చర్చించుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ ఎంపీలు గత నాలుగురోజుల నుండి పార్లమెంట్ ఉభయసభల్లో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా కేంద్ర పెద్దలు మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. మొన్న ప్రసంగంచిన మోడీ కాంగ్రెస్ ను తిట్టడమే సరిపోయింది కానీ ఏపీకి ఏం చేస్తామన్నది మాత్రం చెప్పలేదు. పోనీ నిన్న మాట్లాడిన జైట్లీ అయిన ఏదో ఒకటి చెబుతారనుకుంటే ఆయన కూడా ఒక్క 15 నిమషాలు మీరు ఓపిక పట్టండి అంటూ, మీ గురించే చెప్తాను నాకు టైం ఇవ్వండి అంటూ ఏపీకి నిధులు ఇవ్వాలని అడుగుతున్నారు కానీ కొద్దిగా భారం తగ్గితే ఏపీలాంటి రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అవకాశముంటుందన్నారు.

ఏపీ విభజన సమస్యలపై తనకు సానుభూతి ఉందని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని పాత పాటే పాడారు. ఇక నిన్న జైట్లీ మాటలకు ఏపీ ఇంకా మండిపోతోంది. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్నటి జైట్లీ ప్రసంగం ఏ మాత్రం ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. అందుకే ఆందోళనలు ఉధృతం చేయాలని ఆదేశించారు.

 

loader