బుధవారం రాత్రి తనను కలసిన చక్రపాణితో జగన్ మాట్లాడుతూ ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ చెప్పారు. దాంతో గురువారం నంద్యాలలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ, ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎల్సీ అయిన 90 రోజుల్లోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటం గమనార్హం.
వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేసారు. బుధవారమే చక్రపాణి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, బుధవారం రాత్రి తనను కలసిన చక్రపాణితో జగన్ మాట్లాడుతూ ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ చెప్పారు. దాంతో గురువారం నంద్యాలలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ, ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎల్సీ అయిన 90 రోజుల్లోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటం గమనార్హం. విలువలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వైసీపీలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలు రాజీనామాలు చేయగలరా అంటూ సవాలు విసరటం గమనార్హం. తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపుతున్నట్లు కూడా చక్రపాణిరెడ్డి చెప్పారు.
